NTV Telugu Site icon

Venky Atluri : కోలీవుడ్ స్టార్ హీరోతో వెంకీ అట్లూరి సినిమా.?

Venky

Venky

టాలీవుడ్ యంగ్ దర్శకులలో మోస్ట్ క్రేజియస్ట్ దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది వెంకీ అట్లూరి అనే చెప్పాలి. గతేడాది వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన లక్కీ భాస్కర్ సెన్సేషన్ హిట్ సాధించింది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ఈ సినిమా తెలుగు పాటు తమిళ్, మలయాళం, హిందీ భాషలలో కుడా రిలీజ్ అయి సూపర్ హిట్ సాధించింది. ఈ సినిమా హిట్ తో ధనుష్ తొలి సారి వంద కోట్ల క్లబ్ లో చేరాడు.

Also Read : Kollywood : అజిత్ దెబ్బకు షేకవుతున్న కోలీవుడ్ స్టార్ హీరోలు

తాజగా వెంకీ నెక్ట్స్ సినిమాను కోలీవుడ్ హీరోతో చేయబోతున్నాడట. ధనుష్ స్ట్రయిట్ టాలీవుడ్ సినిమా ‘సార్’ సినిమా తో సూపర్ హిట్ అందించిన వెంకీ అట్లూరి మరోసారి ధనుష్ తోనే సినిమా చేయబోతున్నాడట. ఇందుకు సంబంధించి కథ చర్చలు కూడా ముగిసినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాకు ‘ హానెస్ట్ రాజా’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు చెన్నై వర్గాల సమాచారం. ప్రస్తుతం ధనుష్ ఇళయరాజా బయోపిక్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు స్వీయ దర్శకత్వంలో ఇడ్లీ కడాయి సినిమాలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఫినిష్ అయ్యాక వెంకీ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా కూడా సార్, లక్కీ భాస్కర్ లా మంచి కథానేపథ్యంతో తెరకెక్కనుంది. వెంకీ అట్లూరి సినిమాలను నిర్మించే రెగ్యూలర్ బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లోనే ఈ సినిమా కూడా నిర్మించనున్నారు. త్వరలో అధికారకంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది.