Site icon NTV Telugu

Saindhav: ఒక్క ట్రైలర్ లోనే ఇంతమందిని చంపేశావ్ ఏంటి వెంకీ మామా?

Saindhav

Saindhav

ఫ్యామిలీ హీరో ఇమేజ్ ఎక్కువగా ఉండి, హిట్ సినిమాలు ఇచ్చే ఏకైక సీనియర్ హీరో వెంకటేష్. విక్టరీని ఇంటి పేరుగా మార్చుకున్న వెంకటేష్, చాలాకాలం తర్వాత యాక్షన్ మోడ్ లోకి దిగుతూ చేస్తున్న సినిమా సైంధవ్. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ జనవరి 13న రిలీజ్ కానుంది. ప్రమోషనల్ కంటెంట్ తో మంచి బజ్ నే జనరేట్ చేసిన సైంధవ్ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. చంద్రప్రస్థాలో భార్య, కూతురితో ప్రశాంతంగా జీవితం గడుపుతూ ఉంటాడు సైంధవ్. హ్యాపీగా సాగిపోయే సైంధవ్ జీవితం… కూతురికి ఆరోగ్య సమస్య రావడంతో మలుపు తిరగడం మొదలవుతుంది. తప్పకుండ కూతురిని కాపాడుకోవాల్సిన స్థితిలోకి వచ్చిన సైంధవ్… తన గతానికి వెళ్లి మరీ ఎలాంటి పోరాటం చేసాడు అనేది సైంధవ్ కథగా కనిపిస్తోంది. “సైకో” అనే మారు పేరుతో గతాన్ని గడిపిన సైంధవ్? ఒకప్పుడు ఏం చేసేవాడు? అతనికి మాఫియాతో ఉన్న సంబంధం ఏంటి? అనే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ని ట్రైలర్ లో లైట్ గా టచ్ చేసి వదిలారు. ముఖేష్ రిషి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, ఆండ్రియాలు వెంకటేష్ ఫ్లాష్ బ్యాక్ కి సంబందించిన లింక్ ఉంటూనే ప్రెజెంట్ లో కూడా ట్రావెల్ అవుతున్నారు. వెంకీ మామా వైఫ్ గా శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తోంది.

కూల్ గా స్టార్ట్ అయిన ట్రైలర్ యాక్షన్ మోడ్ లోకి ఎంటర్ అయ్యి ఆ తర్వాత డైరెక్ట్ గా ర్యాంపేజ్ మోడ్ లోకి మారిపోతుంది. వెంకీ మామా ట్రైలర్ లోనే దాదాపు వంద మందిని ఈజీగా చంపేసి ఉంటాడు. అది కూడా కొలతలు పెట్టుకోని క్లీన్ గా కాదు, ఎలా పడితే అలా… ఏది దొరికితే దానితో చంపేశాడు వెంకటేష్. ఇప్పటివరకూ 75 సినిమాలు చేసిన వెంకటేష్… అన్ని సినిమాల్లో కలిపి చేసినంత విధ్వంశం సైంధవ్ ఒక్క దాంట్లోనే చేసినట్లు ఉన్నాడు అనే ఫీలింగ్ కలిగించేలా ట్రైలర్ ని కట్ చేసారు. బుల్లెట్లు ఎటు నుంచి ఎవరికి దూరి ఎక్కడి నుంచి బయటకు వస్తాయో కూడా తెలియనంత బ్రూటల్ గా చంపుతున్నాడు వెంకీ మామా. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కాస్టింగ్ లుక్స్ అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరాయి. ఓవరాల్ గా సైంధవ్ ట్రైలర్ కూతురిని కాపాడుకోవాలి అని సైంధవ్ చేసిన వార్ గా కనిపిస్తోంది, కాకపోతే కొంచెం ఎక్కువ వయొలెన్స్ తో… లైన్ గా చూస్తే కమల్ విక్రమ్ సినిమాకి సైంధవ్ సినిమాకి కాస్త దగ్గర పోలికలు ఉన్నాయి. మరి సైంధవ్ నిజంగానే విక్రమ్ సినిమాలా ఉంటుందా లేక కొంచెం కొత్తగా ఉంటుందా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

 

Exit mobile version