కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథి. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ ‘నా సినీ ప్రయాణంలో ఎప్పుడూ ఒంటరివాడిని కాదు.
నా బిగ్గెస్ట్ హిట్ తెలుగులోనే వచ్చింది. ఇక్కడ నాకు వరుస విజయాలు లభించాయి. నిజానికి నేను, వెంకటేశ్ కలసి ‘మర్మయోగి’ చేయవలసి ఉంది. మిస్ అయింది. వెంకీ కాస్ట్యూమ్ ట్రైల్స్ కూడా చేశాడు. దురదృష్టవశాత్తూ మిస్ అయ్యాము. ఆ సినిమా చేసి ఉంటే మా కెరీర్‌లో గొప్ప సినిమా అయ్యేది’ అని చెప్పారు. తెలుగులో కొన్ని సినిమాలే చేసినా చాలా వరకూ హిట్ అయ్యాయని, ‘విక్రమ్’తో మళ్లీ తెలుగులో హిట్ కొడతాననే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. జూన్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
