Site icon NTV Telugu

వెంకీ చేతుల మీదుగా ‘లక్ష్య’ ట్రైలర్

lakshya

lakshya

ఇటీవల ‘వరుడు కావాలెను’తో హిట్ కొట్టిన నాగశౌర్య తదుపరి ‘లక్ష్య’ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి పతాకంపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా విక్టరీ వెంకటేశ్ చేతుల మీదుగా ఈ మూవీ ట్రైలర్ ను డిసెంబర్ 1న రిలీజ్ చేయనున్నారు. కేతికా శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జగపతిబాబు కీలకపాత్రను పోషించారు. కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతాన్ని అందించిన ఈ సినిమా కోసం నాగశౌర్య విలువిద్యలో శిక్షణ తీసుకోవడం విశేషం. మరి ‘లక్ష్య’తో నాగశౌర్య మరోహిట్ ను ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.

Exit mobile version