Site icon NTV Telugu

Venkatesh: ప్రమోషన్స్ లో ఇంత ఎంటర్ టైన్ చేసిన హీరోను చూపిస్తే.. లైఫ్ టైమ్ సెటిల్ మెంట్ రా

Saindhav

Saindhav

Venkatesh: విక్టరీ వెంకటేష్.. గురించి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో భూతద్దం పెట్టుకొని వెతికినా కూడా వెంకీ మామను ట్రోల్ చేసేవారు ఉండరు. ఏ స్టార్ హీరోకైనా ఫ్యాన్స్ ఉంటారు.. కానీ, స్టార్ హీరోలే వెంకీకి ఫ్యాన్స్. ఇక వెంకీ సినిమా వస్తుంది అంటే.. అందరూ కుటుంబాలతో బయల్దేరతారు. మొదటి నుంచి కూడా వెంకీ.. చాలా రిజర్వడ్ గా ఉంటాడు. ఏదైనా ఫంక్షన్ కు కానీ, ఈవెంట్ కు కానీ వస్తే సైలెంట్ గా తన పని తాను చేసుకోవడం.. వెళ్లిపోవడం మాత్రమే చూసాం. అంతేకాకుండా వెంకీ సోషల్ మీడియాలో ఎక్కువ కనిపించడు. పర్సనల్ విషయాలు అస్సలు షేర్ చేసుకోడు. అయితే.. జనరేషన్ మారే కొద్దీ.. మనం కూడా వారిలా మారాలని వెంకీ తెలుసుకున్నట్లు ఉన్నాడు. అవును.. వెంకీలో ఎప్పుడు చూడని మార్పు ఈ మధ్య కనిపిస్తుంది.

ప్రస్తుతం వెంకీ సైంధవ్ ప్రమోషన్స్ లో ఉన్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ మొదలైనప్పటి నుంచి వెంకీ ఎనర్జీ మాములుగా లేదు. సినిమాలో ఎలా అయితే ఎంటర్ టైన్ చేస్తాడో అలాగే ప్రమోషన్స్ లో కూడా అలాగే అదరగొడుతున్నాడు. కాలేజీలు తిరిగి స్టూడెంట్స్ తో మాట్లాడుతున్నాడు.. స్టేజిల మీద డ్యాన్స్ వేస్తున్నాడు.. ఇంటర్వ్యూలలో ఫుల్ ఫన్ క్రియేట్ చేస్తున్నాడు. నిజం చెప్పాలంటే.. ఈసారి ప్రమోషన్స్ లో ఇంత ఎంటర్ టైన్ చేసిన హీరోను చూపిస్తే.. లైఫ్ టైమ్ సెటిల్ మెంట్ రా అని చెప్పుకోవచ్చు. గతరాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్స్ తోకలిసి నైజాం బాబులు సాంగ్ కు వెంకీ డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version