Venkatesh Responds on Rana Naidu Backlash Comments: విక్టరీ వెంకటేష్ కెరీర్ లో మైల్ స్టోన్ గా 75వ సినిమాగా తెరకెక్కింది సైంధవ్. హిట్ వన్, హిట్ టు సినిమాలతో వరుస హిట్లర్ అందుకున్న శైలేష్ కొలను దర్శకుడిగా వ్యవహరించిన ఈ సినిమాని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద వెంకట్ బోయిన్పల్లి నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో హీరో వెంకటేష్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి అనేక విషయాలు పంచుకోవడమే కాదు తన గత ప్రాజెక్ట్ అయిన రానా నాయుడు గురించి కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. రానా నాయుడు చేసిన తర్వాత మీకున్న ఫ్యామిలీ ఇమేజ్ ఏమైనా మారిపోయిందా అని అడిగితే నాకు అలా ఏమీ అనిపించడం లేదని వెంకటేష్ చెప్పుకొచ్చారు.
Hanuman: ‘శ్రీ ఆంజనేయం’లైన్ లోనే హనుమాన్.. అసలు విషయం చెప్పేసిన ప్రశాంత్ వర్మ
అయితే వెబ్ సిరీస్ కి ఎక్కువ నెగిటివ్ టాక్ వచ్చింది, అదే విధంగా ఎక్కువ చూసిన వెబ్ సిరీస్ గా కూడా నిలిచింది కదా దీన్ని ఎలా భావిస్తున్నారు అని అడిగితే తాను దానిని నెగిటివ్ టాక్ లాగానే భావించడం లేదని అన్నారు. ఎందుకంటే అది నెగిటివ్ గా ఉంటే అంత మంది చూసే అవకాశం లేదని ఆయన చెప్పుకొచ్చారు. అదే విధంగా తనకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఇలాంటి రోల్స్ చేయొద్దని అభ్యర్థనలు వచ్చిన నేపథ్యంలో భవిష్యత్తులో కాస్త శ్రద్ధ తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు. అంతేకాక రానా నాయుడు సిరీస్ జానర్ తనకు చాలా కొత్తగా అనిపించిందని సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో ఒక నాటు వెబ్ సిరీస్ చేస్తే ఎలా ఉంటుందో అనే ఒక ప్రయత్నం చేశానని అది కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదని చెప్పుకొచ్చారు.