Venkatesh Remuneration: ‘సంక్రాంతికి వస్తున్నాం’ క్రేజ్.. వెంకీ మామ రెమ్యూనరేషన్ డబుల్?
- 'విక్టరీ' వెంకటేష్ వరుస విజయాలు
- ఫ్యామిలీ ఆడియన్స్‌లో భారీ మార్కెట్
- వెంకీ మామ రెమ్యూనరేషన్ డబుల్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో ‘విక్టరీ’ వెంకటేష్ క్రేజ్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. వరుస విజయాలు, ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఉన్న భారీ మార్కెట్ కారణంగా వెంకీ మామ రెమ్యూనరేషన్ డబుల్ అయినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు రూ.10 కోట్ల వరకు పారితోషికం తీసుకున్న వెంకీ.. ఇప్పుడు రూ.20 కోట్లు తీసుకుంటున్నారని టాక్. రెమ్యూనరేషన్ హైక్ కావడానికి కారణం.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ క్రేజ్ సహా ‘మన శంకర వరప్రసాద్ గారు’లో చేసిన గెస్ట్ అప్పియరెన్స్‌కు వచ్చిన స్పందనే అని సమాచారం.
2025 ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు వెంకటేష్ రూ.10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను బలంగా ఆకట్టుకుంది. ఈ సక్సెస్ తర్వాత వెంకీ మామ మార్కెట్ ఒక్కసారిగా పెరిగిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ‘ఆదర్శ కుటుంబం’ కోసం రూ.20 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్క సినిమాతోనే రెమ్యూనరేషన్ 100 శాతం జంప్ అయింది. ఇది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. అనిల్ రావిపూడితో వెంకీ ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు కూడా ఇంతే ఛార్జ్ చేయనున్నారు.
Also Read
- Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
- YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
- Jr NTR Fan: ఎన్టీఆర్ ను కలిసి ముద్దాడిన ఫ్యాన్
- Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
Also Read: Pooja Hegde Stylish Look: స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో పూజా హెగ్డే.. మతి పోగొడుతున్న బుట్టబొమ్మ!
విక్టరీ వెంకటేష్ కెరీర్‌ను గమనిస్తే.. మాస్, క్లాస్, ఫ్యామిలీ అన్నీ బ్యాలెన్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేక మార్కెట్‌ను నిలబెట్టుకున్న హీరోగా గుర్తింపు ఉంది. స్టార్డమ్ కంటే కంటెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చే హీరోగా వెంకీకి ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఫలితాల గురించి ఆలోచించకుండా.. కొత్త దర్శకులకు కూడా అవకాశాలు ఇస్తారు. కెరీర్ ఎక్కువగా విజయాలు అందుకున్న వెంకీ.. రెమ్యూనరేషన్ పరంగానూ టాప్ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. మొత్తానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్‌తో వెంకటేష్‌కు డబుల్ లాభం వచ్చినట్టే. ప్రస్తుతం వెంకీ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ‘ఆదర్శ కుటుంబం’ సినిమాతో ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.
తాజావార్తలు
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!