NTV Telugu Site icon

Rana Naidu Teaser: ఫిక్సర్ vs ఫాదర్.. తండ్రికొడుకుల మధ్య యుద్ధం

Rana Naidu Teaser

Rana Naidu Teaser

Venkatesh Rana Daggubati Starrting Rana Naidu Teaser Released: బాబాయ్, అబ్బాయ్‌లైనా విక్టరీ వెంకటేశ్, రానా దగ్గుబాటి కాంబోలో ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ రూపొందుతోన్న విషయం తెలిసిందే! ‘రే డోనోవన్’ రీమేక్ అయిన ఈ వెబ్ సిరీస్‌లో వాళ్లిద్దరు తండ్రికొడుకులుగా నటించారు. ఇంతకుముందు రానా, వెంకీల ఫస్ట్‌లుక్స్ రిలీజైనప్పుడు.. సోషల్ మీడియాలో వాటికి విశేష ఆదరణ లభించింది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ తాజాగా టీజర్ విడుదల చేసింది. ఆద్యంతం యాక్షన్ భరితంగా సాగే ఈ టీజర్.. గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయం.

ఇందులో రానా సెలెబ్రిటీలకు ఫిక్సర్‌గా పని చేస్తుంటాడు. అంటే.. సెలెబ్రిటీలకు ఏదైనా పెద్ద సమస్య వచ్చిపడితే, దాన్ని పరిష్కరించడమే రానా పని. అవతలి వ్యక్తుల్ని చంపడానికి కూడా వెనుకాడడు. ఇతనికి అడ్డు చెప్పడానికి ఎవ్వరూ ఉండరు. ఇతణ్ని ఎదురించే ధైర్యమూ ఎవ్వరికీ ఉండదు. అందుకే, అడ్డుఅదుపు లేకుండా నేరాలు చేసుకుంటూ పోతాడు. అసలు ఇతడ్ని ఆపడం ఎలా? అని ఆలోచిస్తున్న తరుణంలోనే.. నాయుడు (వెంకటేశ్) రంగంలోకి దిగుతాడు. అతను మరెవ్వరో కాదు.. రానా తండ్రే. ఇక అప్పట్నుంచే వీరి మధ్య కొడుకు vs తండ్రి అనే పోరు సాగుతుంది.

చివర్లో.. ‘నాన్న అని పిలవ్వా, నేను నీ తండ్రినిరా’, ‘తండ్రిలాంటి పని చేసుంటే, అప్పుడు పిలిచేవాడ్ని’ అంటూ వెంకీ, రానాలు చెప్పే డైలాగ్ ఈ టీజర్‌లోనే హైలైట్‌గా నిలిచిందని చెప్పుకోవచ్చు. దాన్నిబట్టే వీరి మధ్య పోరు ఎలా సాగుతుందో ఓ అంచనాకి వచ్చేయొచ్చు. ఇందులో బాలీవుడ్ నటి సుర్వీన్ చావ్లాతో పాటు మరెందరో బాలీవుడ్, దక్షిణాది ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ టీజర్‌ని నెట్‌ఫ్లిక్స్ ట్వీట్ చేస్తూ.. ‘దగ్గుబాటి vs దగ్గుబాటికి సమయం ఆసన్నమైంది’’ అని పేర్కొంది.