NTV Telugu Site icon

Venkatesh Maha: అప్పుడు కేజీఎఫ్.. ఇప్పుడు సలార్ వివాదంలో వెంకటేష్ మహా.. ప్రభాస్ ఫాన్స్ దెబ్బకి ట్విట్టర్ డిలీట్?

Venkatesh Maha

Venkatesh Maha

Venkatesh Maha again in Salaar Controversy and Decativates Twitter: కొన్నాళ్ల క్రితం C/o కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా KGF 2 ని అవహేళన చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ విషయం పెద్దది కావడంతో అప్పుడు క్షమాపణ కూడా చెప్పడానికి ప్రయత్నించగా విషయం సద్దుమణిగింది. ఇక ఇప్పుడు KGF 2 మేకర్ సలార్ సినిమాకి డంకీ సినిమాకి మధ్య పోటీ ఉన్న క్రమంలో ఆ విషయాన్నీ మళ్ళీ పరోక్షంగా కెలికాడు వెంకటేష్ మహా అనే కామెంట్లు ఇప్పుడు మొదలయ్యాయి. ఇంతకీ ఏం జరిగింది అంటే.. సెలబ్రిటీలు అంతా ‘సలార్’ సినిమా టికెట్ల గురించి, రిలీజ్ ట్రైలర్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్న క్రమంలో వెంకటేష్ మహా తనకు షారుఖ్ ఖాన్ ‘డంకీ’ సినిమాకి టికెట్ దొరికిందని ఆనందం వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు. నిజానికి ఆయన పెట్టిన దానిలో తప్పేమీ లేదు 21 వ తారీఖున ‘డంకీ’ సినిమా రిలీజ్ అవుతుంది, రాజ్ కుమార్ హిరానీ సినిమాలను ఇష్టపడేవారు.. ఈ సినిమా కోసం కూడా చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ వెంకటేష్ మహా ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమా వస్తుంటే ఆ సినిమాని పట్టించుకోనట్టు మాట్లాడుతున్నాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

Prashanth Neel: అవును.. కెజిఎఫ్ లో చేసిన తప్పులే సలార్ లో కూడా చేశా..

దీంతో ఆయన్ని టార్గెట్ చేసి ట్రోల్ చేయడం ప్రారంభించదాంతో దానిని కప్పిపుచ్చడానికి ప్రయత్నించాడు, “సరే అబ్బాయిలు, శాంతించండి. మీరు యాదృచ్చికంగా పొరబడుతున్నారని నేను భావిస్తున్నాను. నా మునుపటి పోస్ట్ వ్రాసేటప్పుడు డంకీ కోసం నా ఉత్సాహాన్ని పంచుకోవడం తప్ప నాకు వేరే ఉద్దేశాలు లేవు. మీ కామెంట్స్ తర్వాత సాలార్ ట్రైలర్ విడుదలైందని నాకు ఇప్పుడే తెలిసింది. నిజాలు తెలియకుండా మాట్లాడటం మానేయండి అబ్బాయిలు. నేను ప్రభాస్ గారి మొదటి సినిమా నుంచి ఆయనకు పెద్ద అభిమానిని, నేను ఆయతో కలిసి పనిచేయాలని ఎప్పుడూ కోరుకుంటా, అలా అని నేను బహిరంగంగా చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. నేను కూడా సలార్ ట్రైలర్ చూశా, అది అద్భుతంగా ఉంది. ప్రతిదానికీ గందరగోళాన్ని సృష్టించవద్దు, వాస్తవాలను మార్చవద్దు. కొద్ది రోజుల క్రితమే ఇలా చేయవద్దని నేను మీకు చెప్పా అని పేర్కొన్న ఆయన తన ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేశారు.