Site icon NTV Telugu

F3 Trailer: డబ్బున్న వాడికి ఫన్.. లేనివాడికి ఫస్ట్రేషన్

F3 Trailer

F3 Trailer

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ ఎఫ్‌3. టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. తాజాగా F3 ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. 2019 సంక్రాంతి సీజన్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన F2 మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 27న విడుదల కానుంది. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

లోకంలో పంచ‌భూతాలు అంద‌రికీ తెలిసే ఉంటాయి. తెలియ‌ని ఓ భూతం ఉంది. అదే డ‌బ్బు అనే ముర‌ళీ శ‌ర్మ వాయిస్ ఓవ‌ర్‌తో ఈ ట్రైలర్ మొదలవుతుంది. డబ్బున్న వాడికి ఫన్.. లేనివాడికి ఫస్ట్రేషన్ అంటూ మురళీ శర్మ చెప్పే డైలాగ్ ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందో హింట్ ఇస్తోంది. ఈ మూవీలో మురళీ శర్మ కోటీశ్వరుడిగా కనిపించనున్నాడు. అటు హీరోలలో వెంక‌టేష్‌ రే చీక‌టి, వ‌రుణ్ తేజ్‌ న‌త్తితో బాధ‌ప‌డుతుంటారు. వీళ్ల పాత్రల నుంచి ఫ‌న్‌ను క్రియేట్ చేయ‌టంతో పాటు డ‌బ్బు, బంగారం అని ఆశ‌ప‌డే వారి భార్యల వ‌ల్ల హీరోలు ఎలాంటి ఇబ్బందులు ప‌డ్డారో మూవీలో దర్శకుడు అనిల్ రావిపూడి చూపించబోతున్నాడు. సునీల్, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చాడు. F2లో క‌నిపించిన ప్రగ‌తి, వై.విజ‌య‌, అన్నపూర్ణమ్మ, ర‌ఘుబాబు పాత్రలు సీక్వెల్‌లోనూ క‌నిపిస్తున్నాయి. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఇందులో ఓ స్పెష‌ల్ సాంగ్ చేయ‌డం విశేషం.

Exit mobile version