NTV Telugu Site icon

Venkat: OG బిగ్గెస్ట్ ట్రెండ్ సెట్టర్.. అంచనాలు ఇంకా పెంచేసిన హీరో..

Venakt

Venakt

Venkat: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జంటగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం OG. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంతో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక ఈ సినిమాలో స్టార్ క్యాస్టింగ్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మొన్నటివరకు శరవేగంగా షూటింగ్ జరుపుకున్న OG.. ఏపీ ఎలక్షన్స్ వలన వాయిదా పడింది. పవన్ ఒకపక్క రాజకీయాలను, ఇంకోపక్క సినిమాలను మ్యానేజ్ చేస్తున్న విషయం తెల్సిందే. దర్శకనిర్మాతలు కూడా పవన్ కేటాయించిన సమయానికే షూటింగ్ ను జరుపుకుంటున్నారు. ఇక OG కు బ్రేక్ రావడంతో సినిమా గురించి హైప్ తగ్గిపోయింది అనుకుంటున్నారు కానీ, ఎవరో ఒకరు ఈ సినిమా గురించి మాట్లాడడం.. అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం జరుగుతూనే ఉంది. సలార్ రిలీజ్ టైమ్ లో శ్రీయా రెడ్డి.. OG గురించి చెప్పి మంచి హైప్ ఇచ్చింది.

ఇక ఇప్పుడు ఒకప్పటి హీరో వెంకట్.. మరోసారి OG గురించి చెప్తూ హైప్ తీసుకొచ్చాడు. ఒక ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొన్న వెంకట్ మాట్లాడుతూ.. ” 2024 నాకు మంచి ఏడాది అవుతుంది అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ OG లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాను. కళ్యాణ్ అన్న.. నాకు ఎప్పటినుంచో పరిచయం. చిరంజీవి గారిని కలవడానికి ఇంటికి వెళ్ళినప్పుడు కళ్యాణ్ అన్నను కలిసేవాడిని. 23 ఏళ్లుగా నాకు కళ్యాణ్ అన్న తెలుసు. ఆయనతో నటించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజీ.. OG ఫ్యాన్స్ అందరికీ మీల్స్ లా ఉంటుంది. సుజీత్ అద్భుతమైన డైరెక్టర్. చాలామంది యాక్టర్స్ ఉన్నారు ఇందులో. తెలుగు చిత్రపరిశ్రమలో OG బిగ్గెస్ట్ ట్రెండ్ సెట్టర్ అవుతుంది” అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ వ్యాఖ్యలతో OG పై నెక్స్ట్ లెవెల్ హైప్ తెచ్చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.