Site icon NTV Telugu

Venkaih Naidu : గొప్ప మానవతా వాది.. ‘కోట’కు వెంకయ్య నాయుడు నివాళి

Venkaiah Naidu

Venkaiah Naidu

Venkaih Naidu : సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ మృతి పట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. కోట శ్రీనివాస్ రావు మరణం విచారకరం అన్నారు. కోట శ్రీనివాస్ గొప్ప మానవతావాది. అంతకు మించిన గొప్ప నటుడు. విలక్షణమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు. ఆయన సినిమాలలో కనిపిస్తే హాస్యం పండుతుంది. బిజెపి లో చేరి విజయవాడ నుండి ఎమ్మెల్యేగా గెలిచి ఎన్నో సేవలు చేశారు. ఆయన కుమారుడి మరణం ఆయన జీవితాన్ని కుంగదీసింది. కొన్ని ప్రమాణాలు.. పద్ధతులు గల నటున్ని సినిమా రంగం కోల్పోయింది.

Read Also : Kota Srinivas Death : కోట మరణ వార్త బాధాకరం.. ఏపీ బీజేపీ చీఫ్‌ మాధవ్ నివాళి..

తెలుగుతోపాటు అనేక భాషల్లో నటించి అక్కడ అభిమానులను మెప్పించారు. ఆయన మరణం యావత్ సినీ లోకానికి తీరని లోటు. అలాంటి నటుడు మనకు మళ్లీ దొరకడు. కోట శ్రీనివాస్ రావు కుటుంబం సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు వెంకయ్య నాయుడు. ఇక కోట శ్రీనివాస్ అంత్యక్రియలు నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు మహా ప్రస్థానంలో జరగనున్నాయి.

Read Also : Kota Srinivasa Rao: సినిమా రంగం ఒక గొప్ప నటున్ని కోల్పోయింది: కేసీఆర్

Exit mobile version