Venkaiah Naidu : స్క్రీన్ మీద బ్రహ్మానందం కనిపిస్తేనే ప్రేక్షకులకు నవ్వొస్తుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. బ్రహ్మానందం హిందీ, ఇంగ్లిష్ లో ME and मैं పేరుతో తన ఆత్మకథను రాశారు. ఈ పుస్తకాన్ని నేడు వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. బ్రహ్మానందం సినిమాల్లో ఎనలేని పేరును సంపాదించుకున్నారు. ఆయన జీవిత చరిత్రను హిందీ, ఇంగ్లిష్ లో తీసుకొచ్చారు. ఆ పుస్తకాన్ని నేను ఆవిష్కరించడం సంతోషంగా ఉంది. బ్రహ్మానందం ఇప్పటికే 1200 ల సినిమాల్లో నటించారు. ఆయన ప్రేక్షకులకు ఎప్పటికీ ఫేవరెట్. ఆయన పుస్తకం ఆరు భాషల్లో వస్తోంది. బ్రహ్మానందం స్క్రీన్ మీద కనిపిస్తేనే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.
Read Also : Mirai : బాహుబలి తర్వాత మిరాయ్ సినిమానే.. ఆర్జీవీ సంచలనం..
బ్రహ్మానందం ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. ఆయన అలుపెరగని ఆర్టిస్ట్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మాతృభాషను నేర్చుకోవాలి. ఈ పుస్తకాన్ని హిందీ భాషలో తేవడం సంతోషం. ఎందుకంటే ఎక్కువ మంది మన దేశంలో మాట్లాడేది హిందీ భాష. మాతృభాషతో పాటు అవసరం అయిన భాషలు నేర్చుకకోవాలి. దేశంలో ఎక్కువ మందికి చేరువ కావాలంటే హిందీ అవసరం. ప్రపంచంలో మనుగడ సాగించి ఎదగాలంటే ఇంగ్లిష్ అవసరం. మన ఇండియా అభివృద్ధి బాగా చెందుతోంది అంటూ తెలిపారు వెంకయ్య నాయుడు.
Read Also : Mirai : ప్చ్.. మిరాయ్ లో ఇద్దరు హీరోయిన్ల సాంగ్స్ లేపేశారు..
