Site icon NTV Telugu

Veera Simha Reddy: 100 డేస్ సెలబ్రేషన్స్ హిందూపురంలో!

Veera

Veera

Balakrishna: గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని మాసీయస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీగా నిర్మించిన ‘వీరసింహారెడ్డి’ బాలకృష్ణ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించిన ‘వీరసింహారెడ్డి’ చిత్రానికి వందరోజులు పూర్తి కావస్తోంది. ఎనిమిది కేంద్రాలలో విజయవంతంగా వంద రోజులని పూర్తి చేసుకోనుంది. ఏప్రిల్ 23న ‘వీరసింహారెడ్డి’ వీర మాస్ బ్లాక్ బస్టర్ 100 డేస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ ఈవెంట్ కు చిత్ర బృందం అంతా హాజరుకాబోతుంది. ఈ రోజుల్లో సినిమా వందరోజులు ఆడటం అరుదైన విషయం. ఆ అరుదైన రికార్డ్ ని ‘వీరసింహారెడ్డి’ అందుకుంది.

శతదినోత్సవ కేంద్రాలు ఇవే!
‘వీరసింహారెడ్డి’ సినిమా హిందూపురం, చిలకలూరి పేట, ఆలూరు లో డైరెక్ట్ గానూ, విజయవాడ, గుంటూరు, కర్నూలు, ఆదోని, ఆళ్ళగడ్డలో సింగిల్ షిఫ్ట్ తోనూ శతదినోత్సవం పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా హిందూపురంలో ఈ నెల 23న వంద రోజుల వేడుక జరుగనుంది.

Exit mobile version