Site icon NTV Telugu

Veera Sima Reddy: మాస్ మొగుడు రావట్లేదు… ట్రైలర్ వస్తోంది…

Veera Simha Reddy

Veera Simha Reddy

నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీర సింహా రెడ్డి’ నుంచి ‘మాస్ మొగుడు’ సాంగ్ ఈరోజు సాయంత్రం 7 గంటలకి రిలీజ్ అవుతుందని, మాస్ జాతర చెయ్యాలని నందమూరి ఫాన్స్ రెడీగా ఉన్నారు. ఈలోపు ‘వీర సింహా రెడ్డి’ ప్రొడ్యూసర్స్ అయిన మైత్రీ మూవీ మేకర్స్ బాలయ్య ఫాన్స్ కి షాక్ ఇస్తూ… ఈరోజు మాస్ మొగుడు సాంగ్ రావట్లేదు, త్వరలో సాంగ్ రిలీజ్ చేస్తాం అంటూ ట్వీట్ చేశారు. సొంగ్ డిలే అవ్వడంతో మాస్ జాతర చెయ్యాలి అనుకున్న నందమూరి ఫాన్స్ అప్సెట్ అయ్యారు. సాంగ్ రావట్లేదని అప్సెట్ అయిన ఫాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తూ ట్రైలర్ అనౌన్స్మెంట్ బయటకి వచ్చేసింది. ‘వీర సింహా రెడ్డి’ ట్రైలర్ మరియు, లాంచ్ ఈవెంట్ డీటైల్స్ అతి త్వరలో అనౌన్స్ చేస్తాం అంటూ మైత్రీ మూవీ మేకర్స్ చేసిన ట్వీట్ బాలయ్య ఫాన్స్ ని జోష్ లోకి తెచ్చింది. ఈ ట్రైలర్ అనౌన్స్మెంట్ తో సాంగ్ డిలే అవ్వడం అనే వార్తని కొంతమంది పట్టించుకోలేదు, మరికొంతమంది మాత్రం ఇవన్నీ ముందే చూసుకోవాలి కదా సాంగ్ కోసం వెయిట్ చేస్తుంటే ఇప్పుడు వాయిదా వేస్తారు ఏంటి అంటూ ట్విట్టర్ లో కామెంట్స్ పెడుతున్నారు.

మాస్ మొగుడు సాంగ్ ఎప్పుడు బయటకి వచ్చినా అది మాస్ ఆడియన్స్ ని పర్ఫెక్ట్ గా క్యాటర్ చేస్తుందని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ ఉంది, పైగా అన్ని పాటలే వస్తున్నాయి కాబట్టి ట్రైలర్ ని రిలీజ్ చేస్తే సినిమాపై ఉన్న హైప్ మరింత పెరగుతుందనే ఆలోచన చేసే మైత్రీ మూవీ మేకర్స్ సాంగ్ రిలీజ్ ని వాయిదా వేసి ట్రైలర్ ని ముందుకి పుష్ చేస్తున్నట్లు ఉన్నారు. రిలీజ్ కి సరిగ్గా ఒక వారం ముందు ‘మాస్ మొగుడు’ లాంటి మాస్ సాంగ్ బయటకి వస్తే సాలిడ్ బజ్ క్రియేట్ అవుతుంది. ఇది  వీర సింహా రెడ్డి ప్రీబుకింగ్స్ కి చాలా హెల్ప్ అవుతుంది. ఇదిలా ఉంటే ఆన్ లైన్ లోనే కాదు ఆఫ్ లైన్ లో కూడా వీర సింహా రెడ్డి ప్రమోషన్స్ ని అగ్రెసివ్ గా చేస్తున్నారు. హోర్డింగ్స్, ఆటో బ్యానర్స్, పోస్టర్స్ ఇలా వీలైనన్ని విధాల వీర సింహా రెడ్డి ప్రమోషన్స్ ని చేస్తున్నారు మేకర్స్. ఇప్పుడున్న బజ్ చూస్తుంటే వీర సింహా రెడ్డి సినిమా బాలయ్య కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టే సినిమాగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి బాలయ్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అనే బెంచ్ మార్క్ ని రీచ్ అవుతాడో లేదో చూడాలి.

Exit mobile version