NTV Telugu Site icon

Veera Simha Reddy: ఈ పాటలో బాలయ్య బాబు డాన్స్ ఉంటుంది రా చారీ…

Maa Bava Manobhavalu

Maa Bava Manobhavalu

నటసింహం నందమూరి బాలకృష్ణ చాలా రోజుల తర్వాత తనకి టైలర్ మేడ్ రోల్ అయిన ఫ్యాక్షన్ గెటప్ లోకి మారి చేస్తున్న సినిమా ‘వీర సింహా రెడ్డి’. బాలయ్యకి డై హార్డ్ ఫ్యాన్ అయిన గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ జనవరి 12న ఆడియన్స్ ముందుకి రానుంది. శృతి హాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘వీర సింహా రెడ్డి’ సినిమా ప్రమోషన్స్ నందమూరి అభిమానులకి కిక్ ఇచ్చే రేంజులో జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రెండు సాంగ్స్ బయటకి వచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. తమన్ ఇచ్చిన ట్యూన్స్ బాలయ్య ఫాన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇప్పటివరకూ బయటకి వచ్చిన రెండు సాంగ్స్ ని మించేలా, మాస్ కి కిక్ ఇచ్చేలా మూడో సాంగ్ బయటకి రానుంది.

‘మా బావ మనోభావాలు’ అనే టైటిల్ తో బయటకి రానున్న ఈ థర్డ్ సాంగ్ అనౌన్స్మెంట్ ఇటివలే బయటకి వచ్చింది. డిసెంబర్ 24న మధ్యాహ్నం రెండు గంటలకి సంధ్య 35MM థియేటర్ లో ఈవెంట్ చేసి గ్రాండ్ గా ‘మా బావ మనోభావాలు’ సాంగ్ ని రిలీజ్ చెయ్యనున్నారు. సాంగ్ రిలీజ్ కి ఇంకా టైం ఉండడంతో, మైత్రి మూవీ మేకర్స్ నందమూరి అభిమానులకి స్పెషల్ గిఫ్ట్ లా, ఈ సాంగ్ ప్రోమోని ఈరోజు రిలీజ్ చెయ్యబోతున్నారు. ఈ విషయం గురించి చెప్తూ ట్వీట్ చేసిన తమన్… “మా బావ మనోభావాలు ప్రోమో ఈరోజు బయటకి వస్తుంది, ఈ పాటలో బాలయ్య గారి డాన్స్ సూపర్ ఉంటుంది” అంటూ పోస్ట్ చేశాడు. ప్రోమో బయటకి వస్తుందని తెలియగానే నందమూరి అభిమానులు, ‘మా బావ మనోభావాలు’ పాట ‘లెజెండ్’ సినిమాలోని ‘లస్కు టపా’ రేంజులో ఉండాలని తమన్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి తమన్, బాలయ్య కోసం ఎలాంటి ఊపునిచ్చే సాంగ్ చేశాడో చూడాలి.