NTV Telugu Site icon

Big Breaking: ‘లైగర్’ తరువాత కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన విజయ్ దేవరకొండ

Vijay

Vijay

Big Breaking: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా తరువాత కొంచెం గ్యాప్ తీసుకున్న విషయం తెల్సిందే. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన లైగర్ విజయ్ ను కోలుకోలేని దెబ్బ తీసింది. ఇక ఈ సినిమా పరాజయం నుంచి బయటపడడానికి రౌడీ హీరోకు చాలా సమయమే పట్టింది. మధ్యలో శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో సమానత హీరోయిన్ గా చేస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. ఇది ఇంకా సెట్స్ మీద ఉండగానే విజయ్ మరో కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశాడు. జెర్సీ సినిమాతో నానికి బిగ్గెస్ట్ హిట్ ను అందించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్.. VD12 చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ పై శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఎస్. నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ పోస్టర్ లో విజయ్ పోలీస్ దుస్తుల్లో మాస్క్ వేసుకొని కనిపించాడు. ” నేను ఎవరిని మోసం చేశానో చెప్పడానికి నేను ఎక్కడ ఉన్నానో నాకే తెలియదు” అని ఒక స్పై చెప్పిన వాక్యాన్ని రాసుకొచ్చారు. ఇదొక స్పై ఫిల్మ్ అని పోస్టర్ ని బట్టి అర్థమవుతోంది. అలాగే సముద్రతీరంలో యుద్ధ సన్నివేశాన్ని తలపించేలా మంటల్లో దగ్ధమవుతున్న పడవలతో పోస్టర్ ను ఆసక్తి రేకెత్తించేలా రూపొందించడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మొదటి సారి వీడీ స్పై గా, పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇక ఈ చిత్రంలో మిగతా నటీనటుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి.