NTV Telugu Site icon

VarunLav: వరుణ్ – లావణ్య పెళ్లి ఫోటో వచ్చేసిందోచ్

Vl

Vl

VarunLav: మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి వేద‌మంత్రాల సాక్షిగా వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. ఇటలీలోని టుస్కానీ నగరంలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటల 48 నిమిషాలకు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్ళు వేశాడు. మెగా, అల్లువారి కుటుంబాలతో పాటు అత్యంత సన్నహితుల మధ్య వరుణ్- లావణ్య పెళ్లి ఘనంగా జరిగింది. ఇక వీరి పెళ్లి ఫోటోను నాగబాబు ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

నూతన వధూవరులైన వరుణ్ తేజ్ కొణిదెల మరియు లావణ్య కొణిదెల కోసం మీ ఆశీస్సులు కోరుతున్నాము అంటూ రాసుకొచ్చాడు. నూతన వధూవరుల జంట ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. డిజైనర్ దుస్తుల్లో కొత్త జంట ఎంతో అందంగా ఉన్నారు. రెడ్ కలర్ లెహంగాలో లావణ్య.. గోల్డ్ కలర్ షేర్వాణీ లో వరుణ్ అద్భుతంగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక అభిమానులు కొత్త జంటకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు.

Show comments