NTV Telugu Site icon

VarunLav: హల్దీ వేడుక.. హైలైట్ అంటే మెగాస్టారే..

Varun

Varun

VarunLav: ప్రస్తుతం ఇటలీ మొత్తం మెగా ఫ్యామిలీనే నిండిపోయి ఉంది అంటే అతిశయోక్తి కాదు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలు ఇటలీలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవంబర్ 1 న పెళ్లి జరగనుండగా.. దానికి ముందు కార్యక్రమాలను గ్రాండ్ గా జరిగిపోతున్నాయి. గతరాత్రి కాక్ టైల్ పార్టీ గ్రాండ్ గా జరిగింది. ఇందులో రామ్ చరణ్, అల్లు అర్జున్ హైలైట్ గా నిలిచారు. ఒకే ఫ్రేమ్ లో ఈ ఇద్దరు హీరోలు.. నూతన వధూవరులతో కలిసి నవ్వుతూ కనిపించారు. ఇక నేడు హల్దీ వేడుక మొదలయ్యినట్లు తెలుస్తోంది. ఈ హల్దీ వేడుకలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి హల్దీ అంటే.. పసుపు రాసే ఫంక్షన్.

Renu Desai: వరుణ్ పెళ్ళి.. నేనే కాదు వాళ్లను కూడా పంపడం లేదు

ఇక ఇందులో వరుణ్- లావణ్యను వేరు వేరుగా కూర్చోపెట్టి.. వారికి సంబంధించిన బంధువులు పసుపు రాసి.. మంగళ స్నానం జరిపిస్తారు. ఇక వైట్ అండ్ ఎల్లో కలర్ థీమ్ డ్రెస్ లతో మెగా ఫ్యామిలీ కనువిందు చేశారు. వరుణ్ ఎల్లో కలర్ కుర్తాలో కనిపించగా.. లావణ్య ఎల్లో కలర్ లెహంగాలో అదరగొట్టింది. ఇక ఈ హల్దీ వేడుకలో అందరికన్నా హైలైట్ గా నిలిచింది మెగాస్టారే అని చెప్పాలి. డార్క్ ఎల్లో కలర్ కుర్తాలో బ్లాక్ గాగుల్స్ పెట్టుకొని.. ఒక చైర్ లో కూర్చొని కనిపించాడు చిరు. ఇక ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఆ స్టైల్, స్వాగ్ మాత్రం వేరే లెవెల్ లో ఉందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఫేస్ కొంచెం రైట్ టర్నింగ్ ఇచ్చి ఉంటే ఇంకా బావుండేది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Show comments