ప్రజంట్ మంచి హిట్ కోసం చూస్తున్నా హీరోల్లో వరుణ్ తేజ్ ఒకరు. వరుస సినిమాలు చేస్తున్నప్పటి సరైన విజయం మాత్రం అందుకోలేక పొతున్నాడు. రీసెంట్‌గా కరుణకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కిన ‘మట్కా’ బాక్సాఫీస్ వద్ద ఊహించని ఫ్లాప్ అందుకుంది. ఈ సినిమా మీద వరుణ్ చాలా ఆశలు పెట్టుకున్నప్పటికీ నిరాశే మిగిలింది. ప్రమోషన్ లు కూడా గట్టిగ చేయకపోవడం ఈ సినిమాకు మరింత మైనస్ అయింది.గతంలో అతని నటనను మెచ్చుకున్నా కొన్ని చిత్రాలు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. ‘గాండీవ ధర అర్జున’, ‘ఆపరేషన్ వాలెంటైన్’, ఇప్పుడు ‘మట్కా’ వంటి సినిమాలు నిరాశ కలిగించాయి. అయినప్పటికి వేనకడుగు వేయని వరుణ్ తన మరో కొత్త సినిమా కోసం పోస్టర్‌ను విడుదల చేశారు.
నేడు వరుణ్ పుట్టిరోజు సందర్భంగా వీటీ15 (VT15) సినిమాను ప్రకటించేశాడు.మేకర్స్ వీటీ15 సినిమా ఫస్ట్ లుక్ షేర్ చేశారు. ఈ పోస్టర్ డ్రాగన్ డిజైన్ ఉన్న జాడిపై కోడ్ లాంగ్వేజ్‌తో ఉన్న క్లాత్ మంటలు అంటుకొని అనుమానాస్పదంగా కనిపిస్తుంది. వేట హాస్యాస్పదంగా మారితే అంటూ క్యాప్షన్ కూడా పోస్టర్‌లో ఇచ్చారు. అంటే సస్పెన్స్, కామెడీ ఎలిమెంట్స్‌తో కూడిన కథతో ఈ సినిమా ఉండబోతుందని హింట్ ఇచ్చారు. అంతేకాదు ఇండో-కొరియన్ హార్రర్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉండబోతుందని ఈ పోస్టర్ తో క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ప్రజంట్ ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా ఈ మూవీకి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌తో అసోసియేట్ అవుతూ యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇక నటీనటులు, షూటింగ్, రిలీజ్ అప్‌డేట్స్ త్వరలో రివిల్ చేయనున్నారు మేకర్స్.