NTV Telugu Site icon

Varun Tej: మట్కా.. అతని బయోపికా.. ?

Matka

Matka

Varun Tej:మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ‘మట్కా’ను భారీ ఎత్తున్న ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. పలాస ఫేమ్ దర్శకుడు కరుణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్, డ్యాన్సర్ నోరా ఫతేహి ఒక హీరోయిన్ గా నటిస్తున్న సంగతి ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ స్థాయిలో నిర్మించనున్న ఈ పాన్ ఇండియన్ మూవీ ప్రారంభోత్సవ వేడుక కూడా ఇటీవలే ఘనంగా జరిగింది. 1958-1982 మధ్య కాలంలో జరిగే కథగా ఈ సినిమా తెరకెక్కుతుంది. వరుణ్ ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నాడు.

ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఒక గ్యాంబ్లర్ బయోపిక్ అని తెలుస్తోంది. అతనే రతన్ ఖత్రి. మట్కా కింగ్ గా పేరు తెచ్చుకున్న రతన్ .. బాలీవుడ్ లో నిర్మాతగా మంచి సినిమాలనే నిర్మించాడు. 1960లు మరియు 1980ల మధ్య భారతదేశంలోని మట్కా బిజినెస్ చేసి.. తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరుచుకున్నాడు. ఇక ఆ డబ్బుతో ఖత్రీ 1976 చిత్రం రంగీలా రతన్ సినిమాలతో నిర్మాతగా మారాడు. అతని జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్నదే మట్కా. ఇందులో మట్కా కింగ్ గా వరుణ్ తేజ్ నటిస్తున్నాడు. ఇక ఇదంతా వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో వరుణ్ నాలుగు విభిన్నమైన గెటప్స్ లో కనిపించనున్నాడట. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.