Varun Tej: మట్కా.. అతని బయోపికా.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varun Tej:మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ‘మట్కా’ను భారీ ఎత్తున్న ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. పలాస ఫేమ్ దర్శకుడు కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్, డ్యాన్సర్ నోరా ఫతేహి ఒక హీరోయిన్ గా నటిస్తున్న సంగతి ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ స్థాయిలో నిర్మించనున్న ఈ పాన్ ఇండియన్ మూవీ ప్రారంభోత్సవ వేడుక కూడా ఇటీవలే ఘనంగా జరిగింది. 1958-1982 మధ్య కాలంలో జరిగే కథగా ఈ సినిమా తెరకెక్కుతుంది. వరుణ్ ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నాడు.
ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఒక గ్యాంబ్లర్ బయోపిక్ అని తెలుస్తోంది. అతనే రతన్ ఖత్రి. మట్కా కింగ్ గా పేరు తెచ్చుకున్న రతన్ .. బాలీవుడ్ లో నిర్మాతగా మంచి సినిమాలనే నిర్మించాడు. 1960లు మరియు 1980ల మధ్య భారతదేశంలోని మట్కా బిజినెస్ చేసి.. తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరుచుకున్నాడు. ఇక ఆ డబ్బుతో ఖత్రీ 1976 చిత్రం రంగీలా రతన్ సినిమాలతో నిర్మాతగా మారాడు. అతని జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్నదే మట్కా. ఇందులో మట్కా కింగ్ గా వరుణ్ తేజ్ నటిస్తున్నాడు. ఇక ఇదంతా వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో వరుణ్ నాలుగు విభిన్నమైన గెటప్స్ లో కనిపించనున్నాడట. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.
Also Read
- Jagapathi Babu: ఒకప్పటి స్టార్ హీరో.. రోడ్డుపై అంతలా తిరిగినా ఎవరూ గుర్తుపట్టలేదు? వైరల్ అవుతున్న వీడియో!
- Trisha: త్రిషకు మెగా కోడలు సర్ప్రైజ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఉపాసన స్పెషల్ గిఫ్ట్!
- Killer Movie Accident: ఎస్.జె.సూర్య 'కిల్లర్' సెట్స్‌లో సిలిండర్ బ్లాస్ట్.. ఒకరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం!
- 4 Years of Vikram: లోకనాయకుడి 'విక్రమ్' కి నాలుగేళ్లు.. నేటికీ చెక్కు చెదరని ఎల్సీయూ (LCU) రికార్డ్స్!
తాజావార్తలు
-
Cricket: క్రికెట్ అభిమానులకు బిగ్ అలర్ట్.. విలీనం దిశగా రెండు ఫ్రాంచైజీలు.. ఇక ఒకే జట్టుగా బరిలోకి..
-
Trump: మొజ్తబా ఖమేనీని కలవాలనుకుంటున్నా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Iran War: కువైట్ ఏయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి..
-
Bengal Politics: బెంగాల్ ప్రతిపక్ష నేతగా రీటబ్రత.. మమత పార్టీలో కల్లోలం..
-
El Nino-Centre: ఎల్‌నినోపై కేంద్రం అప్రమత్తం.. భయాందోళన అక్కర్లేదని హామీ
ట్రెండింగ్
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!