Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి వార్తలు నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెల్సిందే. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో వరుణ్ ఎన్నో రోజులుగా ప్రేమాయణం నడుపుతున్నాడని, వీరి ప్రేమను పెద్దలు అంగీకరించి పెళ్ళికి ఓకే చెప్పినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అంతేనా జూన్ 9 న వీరి ఎంగేజ్ మెంట్ అత్యంత సన్నహితుల మధ్య జరుగుతుందని కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఇవన్నీ పుకార్లు మాత్రమే అని అనుకొనేలా చేస్తున్నారు మెగా ఫ్యామిలీ. వీటిపై ఒక్కరు కూడా స్పందించింది లేదు. అటు వరుణ్ కానీ, ఇటు లావణ్య కానీ.. ఈ వార్తపై రియాక్ట్ అయ్యింది లేదు. మెగా బ్రదర్ నాగబాబు, మెగా డాటర్ నిహారిక సైతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నా.. ఈ వార్తను పట్టించుకొన్నట్లే ఉంటున్నారు.
Sharwanand: హల్దీ ఫంక్షన్.. సందడంతా పెళ్లి కొడుకుదే
సరే పెళ్లి కొడుకు వరుణ్ కూడా అసలు ఈ వార్త నా వరకు రాలేదే అన్నట్లు ఇటలీలో వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఆ వెకేషన్ కూడా లావణ్యతోనే అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్స్ కు గ్యాప్ ఇచ్చిన వరుణ్.. ఇటలీలో వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.. ఇటలీ వీధుల్లో తిరుగుతూ తనకు నచ్చిన ఫుడ్ ను.. నచ్చిన ప్రదేశాలను ఎంజాయ్ చేస్తూ.. ఆ అనుభూతులను అభిమానులతో పంచుకుంటున్నాడు. తాజాగా వరుణ్ .. ఇటలీలోని ఒక రెస్టారెంట్ లో చెఫ్ గా మారిపోయాడు. ఎంతో శ్రద్దగా పిజ్జా తయారుచేయడం నేర్చుకున్నాడట. ఆ విషయాన్నీ అభిమానులతో చెప్పుకొస్తూ.. కుకింగ్ క్లాసెస్.. పిజ్జా, పాస్తా చేయడం నేర్చుకున్నాను.. చాలా అద్భుతంగా వచ్చింది అంటూ ఫోటోలు షేర్ చేశాడు. ఇక ఈ ఫోటోలపై అభిమానులు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. ఇక్కడ ఎంగేజ్ మెంట్ అది ఇది అని రరూమర్స్ వస్తుంటే.. అక్కడ పిజ్జా తయారుచేయడం నేర్చుకుంటున్నావా..? అని కొందరు.. ఏంటి.. వరుణ్ బాబు.. పెళ్ళికి ముందే అన్ని నేర్చేసుకుంటున్నావా..? అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు.ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.