Varun Tej: పవన్ కళ్యాణ్ మాటలు గుర్తుచేసుకున్న వరుణ్ తేజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన వ్యక్తిగత జీవితం, మెగా కుటుంబం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాజాగా ఆయన ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను మొదటి నుంచి కొంత ప్రైవేట్ పర్సన్‌గా ఉంటానని, ఎక్కువగా తన పని, కుటుంబం, స్నేహితులకే సమయం కేటాయిస్తానని తెలిపారు. షూటింగ్ సమయంలో సినిమాపైనే పూర్తిగా దృష్టి పెడతానని, షూటింగ్ లేని సమయంలో కుటుంబంతో గడపడం, స్నేహితులతో టైం స్పెండ్ చేయడం, ట్రావెలింగ్ చేయడం తనకు ఇష్టమని చెప్పారు.
“నా సినిమా, నా వర్క్, నా ఎఫర్ట్ మాట్లాడాలని నేను నమ్ముతాను. నేను చెప్పే మాటల కంటే నా పని ఎక్కువగా మాట్లాడాలి అనుకుంటాను. ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా ఆలోచించి మాట్లాడాలి. నోటి నుంచి వచ్చిన మాటను వెనక్కి తీసుకోలేం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి” అని వరుణ్ తేజ్ అన్నారు. చిన్నప్పటి నుంచి తమ కుటుంబంలో పెద్దలు మంచి విలువలు నేర్పించారని ఆయన గుర్తుచేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. ఆయన ఎప్పుడూ ప్రోత్సాహం ఇస్తారని, అయితే ప్రయత్నంలో ఎలాంటి లోపం ఉండకూడదని చెబుతుంటారని తెలిపారు. “మంచి ప్రయత్నాలు చేస్తే విజయం వస్తుంది. కానీ మన వైపు నుంచి ఎఫర్ట్ 100 శాతం ఉండాలి. ప్రతిరోజూ మనల్ని మనం మెరుగుపరుచుకోవాలి అని బాబాయ్ పవన్ కళ్యాణ్ చెప్పేవారు” అని వరుణ్ తేజ్ పేర్కొన్నారు.
Also Read
- Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
- The Paradise Teaser Review: నాని ‘ది ప్యారడైజ్’ టీజర్ రివ్యూ.. మాస్ అవతార్‌తో రచ్చ చేసిన న్యాచురల్ స్టార్!
- The Paradise Teaser: నాని మాస్ విశ్వరూపం.. ‘ది ప్యారడైజ్’తో బాక్సాఫీస్ బద్దలేనా!
- Varanasi: ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసినా ఎలా లీక్ అవుతున్నాయి మైక్?
తన డైలీ రొటిన్ గురించి కూడా వరుణ్ తేజ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. షూటింగ్ లేని టైంలో ఎక్కువగా ఇంట్లోనే ఉండటానికి ఇష్టపడతానని, ఉదయం వ్యాయామం చేయడం, కుటుంబంతో సమయం గడపడం తన రొటీన్లో భాగమని చెప్పారు. పెళ్లి తర్వాత తన జీవనశైలిలో కొంత మార్పు వచ్చిందని, ప్రస్తుతం భార్యా, కొడుకుతో కలిసి ఇంట్లో ప్రశాంతంగా సమయం గడపడం ఇష్టమని అన్నారు. అప్పుడప్పుడు స్నేహితులను కలవడం, స్పోర్ట్స్ ఆడటం చేస్తానని చెప్పారు. మెగా కుటుంబంలో పిల్లలందరికీ ప్రత్యేకమైన బంధం ఉందని, పండుగల సమయంలో అందరూ కలిసి గడపడం ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని వరుణ్ తేజ్ తెలిపారు.
తాజావార్తలు
-
West Bengal: మసీదు లౌడ్‌స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
-
Mohan Bhagwat: జెన్-జీతో దేశద్రోహులైపోతారా? నిరసనలో తప్పేముంది? మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
-
Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
-
Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
-
Raksha Bandhan 2026: రక్షా బంధన్ 2026 ఎప్పుడు..? రాఖీ కట్టేందుకు శుభ ముహూర్తం.. గ్రహణం ప్రభావం ఉంటుందా?
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!