Varun Tej: వరుణ్ తేజ్ నెక్ట్స్ టైటిల్ రివీల్.. అదిరిందయ్యా ‘అర్జున’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varun Tej Praveen Sattaru Film Title Revealed: మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే! కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఒక పైలట్ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని చిన్న హింట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు అతని పుట్టినరోజు సందర్భంగా.. ఆ సినిమా టైటిల్‌ను మోషన్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ‘గాండీవధారి అర్జున’ అనే టైటిల్‌ని ఖరారు చేసినట్టు ప్రకటించారు. అంతేకాదు.. మోషన్ పోస్టర్ కూడా అదిరింది. వెనకాల ఓ కారు తగలబడుతుండగా.. వరుణ్ తేజ్ ఒక చేత్తో గూండాని నేలకేసి కొడుతూ, మరో చేత్తో గన్ పట్టుకొని ఇంటెన్స్ లుక్‌లో అదరహో అనిపించాడు. ఈ మోషన్ పోస్టర్‌కి మిక్కీ జే మేయర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సూపర్‌గా ఉంది. చూస్తుంటే.. ప్రవీణ్ సత్తారు, వరుణ్ తేజ్ కలిసి ఒక ప్రామిసింగ్ ప్రాజెక్ట్‌తో రాబోతున్నట్టు తెలుస్తోంది.
Priya Bhavani Shankar: నేను ఇండస్ట్రీకి వచ్చింది దాని కోసమే.. ప్రియా సంచలనం
Also Read
చందమామ కథలు సినిమాతో జాతీయ పురస్కారం అందుకున్న ప్రవీణ్ సత్తారు.. ‘గరుడ వేగ’ సినిమాతో అందరినీ మైమరిపించాడు. నాగార్జునతో చేసిన ‘ద ఘోస్ట్’ సినిమాతోనూ ప్రశంసలు అందుకున్నాడు. ఆ రెండు సినిమాలు కమర్షియల్‌గా పెద్ద విజయాలు సాధించకపోయినా.. ఫిల్మ్ మేకర్‌గా ప్రవీణ్‌కి మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంతోనే వరుణ్‌తో చేస్తున్న ‘గాండీవధారి అర్జున’ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మోషన్ పోస్టర్‌తోనే ఆకట్టుకున్నారు కాబట్టి, సినిమా కూడా అంతకుమించి ఉంటుందని అంచనా వేసుకోవచ్చని సినీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను తన ఎస్‌వీసీసీ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. గనితో ఘోర పరాజయం చూసిన వరుణ్ తేజ్.. ఈ చిత్రంతో తిరిగి హిట్ ట్రాక్‌లోకి రావాలని ఆకాంక్షిస్తున్నాడు.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!