Site icon NTV Telugu

Varun Tej: వరుణ్ తేజ్ నెక్ట్స్ టైటిల్ రివీల్.. అదిరిందయ్యా ‘అర్జున’

Varun Tej Next Titled

Varun Tej Next Titled

Varun Tej Praveen Sattaru Film Title Revealed: మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే! కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఒక పైలట్ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని చిన్న హింట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు అతని పుట్టినరోజు సందర్భంగా.. ఆ సినిమా టైటిల్‌ను మోషన్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ‘గాండీవధారి అర్జున’ అనే టైటిల్‌ని ఖరారు చేసినట్టు ప్రకటించారు. అంతేకాదు.. మోషన్ పోస్టర్ కూడా అదిరింది. వెనకాల ఓ కారు తగలబడుతుండగా.. వరుణ్ తేజ్ ఒక చేత్తో గూండాని నేలకేసి కొడుతూ, మరో చేత్తో గన్ పట్టుకొని ఇంటెన్స్ లుక్‌లో అదరహో అనిపించాడు. ఈ మోషన్ పోస్టర్‌కి మిక్కీ జే మేయర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సూపర్‌గా ఉంది. చూస్తుంటే.. ప్రవీణ్ సత్తారు, వరుణ్ తేజ్ కలిసి ఒక ప్రామిసింగ్ ప్రాజెక్ట్‌తో రాబోతున్నట్టు తెలుస్తోంది.

Priya Bhavani Shankar: నేను ఇండస్ట్రీకి వచ్చింది దాని కోసమే.. ప్రియా సంచలనం

చందమామ కథలు సినిమాతో జాతీయ పురస్కారం అందుకున్న ప్రవీణ్ సత్తారు.. ‘గరుడ వేగ’ సినిమాతో అందరినీ మైమరిపించాడు. నాగార్జునతో చేసిన ‘ద ఘోస్ట్’ సినిమాతోనూ ప్రశంసలు అందుకున్నాడు. ఆ రెండు సినిమాలు కమర్షియల్‌గా పెద్ద విజయాలు సాధించకపోయినా.. ఫిల్మ్ మేకర్‌గా ప్రవీణ్‌కి మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంతోనే వరుణ్‌తో చేస్తున్న ‘గాండీవధారి అర్జున’ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మోషన్ పోస్టర్‌తోనే ఆకట్టుకున్నారు కాబట్టి, సినిమా కూడా అంతకుమించి ఉంటుందని అంచనా వేసుకోవచ్చని సినీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను తన ఎస్‌వీసీసీ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. గనితో ఘోర పరాజయం చూసిన వరుణ్ తేజ్.. ఈ చిత్రంతో తిరిగి హిట్ ట్రాక్‌లోకి రావాలని ఆకాంక్షిస్తున్నాడు.

Aparna Balamurali: హీరోయిన్‌తో స్టూడెంట్ మిస్‌బిహేవ్

Exit mobile version