Site icon NTV Telugu

Varun Tej : భార్య కోసం చెఫ్ గా మారిన వరుణ్.. ఏం చేశాడంటే..?

Varun Trj

Varun Trj

Varun Tej : హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. చివరగా ఆయన నటించిన మట్కా సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం ఆయన మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గానే వరుణ్‌, లావణ్య దంపతులు గుడ్ న్యూస్ చెప్పారు. లావణ్య ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో.. ఆమె కోసం వరుణ్‌ తేజ్ కొన్ని స్పెషల్ కేర్స్ తీసుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన విషయాలను అప్పుడప్పుడు పంచుకుంటూ ఉన్నాడు. తాజాగా తన భార్య కోసం చెఫ్‌ గా మారిపోయాడు వరుణ్‌ తేజ్. ఇంట్లో ఎంతో మంది చెఫ్ లు ఉన్నా సరే తానే స్వయంగా భార్య కోసం పిజ్జా తయారు చేశాడు.

Read Also : Trump: భారత్-పాక్ యుద్ధంపై ట్రంప్ యూటర్న్

వరుణ్‌ పిండి కలుపుతూ.. పిజ్జాకు కావాల్సినవన్నీ తానే ఏర్పాటు చేసుకున్నాడు. చివరకు పిజ్జా తయారు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన వారంతా వరుణ్‌ తన భార్య కోసం ఎంత కేర్ తీసుకుంటున్నాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వరుణ్‌, లావణ్య ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. చాలా కాలం పాటు రిలేషన్ లో ఉన్న ఈ జంట.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి లావణ్య సినిమాలు చేయడం మానేసింది. వరుణ్‌ మాత్రం వరుస మూవీలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు.

Read Also : Single : రూ.25 కోట్లు దాటిన శ్రీవిష్ణు ‘సింగిల్’ కలెక్షన్లు

Exit mobile version