NTV Telugu Site icon

Varun Tej: నిహారిక విడాకులు.. వరుణ్ పెళ్లి వాయిదా.. ?

Niharika

Niharika

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి గురించి వార్తలు గుప్పుమంటున్నాయి. గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఈ ఏడాది ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో ఎంగేజ్ మెంట్చేసుకున్న విషయం తెల్సిందే. ఇక నిశ్చితార్థం తరువాత వీరి పెళ్లి ఎప్పుడెప్పుడు జరుగుతుందా.. ? అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక వీరి పెళ్లి ఆగస్టు లో జరుగుతుందని, ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకుంటున్నారని వార్తలు కూడా వచ్చాయి. కానీ, అందులో నిజం ఎంత అనేది ఇప్పటివరకు తెలియదు. ఇంకోపక్క ఈ ప్రేమ జంట తమ తమ కెరీర్ లను నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వరుణ్ ప్రస్తుతం గాండీవధారి అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. లావణ్య.. ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోంది.

Pawan Kalyan: 2024లో పవర్ స్టార్ ర్యాంపేజ్ చూస్తారు!

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వరుణ్ పెళ్లి వాయిదా పడినట్టు తెలుస్తోంది. అందుకు కారణం మెగా డాటర్ నిహారిక అని చెప్పుకొస్తున్నారు. ఈ ఏడాది మెగా ఇంట రెండు మంచి విషయాలు.. ఒక చెడు విషయం జరిగింది. అవేంటంటే..వరుణ్ – లావణ్య ఒక్కటి అవ్వడం.. చరణ్- ఉపాసన కు బిడ్డ పుట్టడం మంచి విషయాలు అయితే.. ఇదే ఏడాది నిహారిక భర్తతో విడిపోయి.. విమర్శల పాలయ్యింది. ఇక ఈ నేపథ్యంలోనే వరుణ్ పెళ్లి వెంటనే జరిగితే బావుండదని ఆలోచించిన మెగా కుటుంబం వరుణ్ పెళ్లిని వాయిదా వేసినట్లు సమాచారం. నిహారిక విడాకులు తీసుకొని రెండు నెలలు కూడా కాలేదు. అప్పుడే ఇంట్లో శుభకార్యం అంటే నిహారిక మనసు బాధపడుతుందని, ఆమె పూర్తిగా కోలుకున్నాక.. నిదానంగా ఈ పెళ్లి జరిపించాలని నాగబాబు అనుకుంటున్నట్లు సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.

Show comments