NTV Telugu Site icon

Varun Tej- Lavanya: నా లవ్ దొరికిందంటూ ఎంగేజ్మెంట్ ఫొటోస్ షేర్ చేసిన లావణ్య -వరుణ్..

Varun Tej Lavanya

Varun Tej Lavanya

మెగా ఫ్యామిలీలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ ల ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగిన విషయం తెలిసిందే..ఈ ఎంగేజ్మెంట్ మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో ఘనంగా జరిగింది.ఈ వేడుకకు వరుణ్‌, లావణ్య కుటుంసభ్యులతో పాటు మెగా, అల్లు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు హాజరయ్యారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్‌ చరణ్, ఉపాసన సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, వైష్ణవ తేజ్ లతో పాటు పలువురు సెలెబ్రీటీలు పాల్గొన్నారు…ఇక నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేశారు వరుణ్‌, లావణ్య. ‘లవ్‌ దొరికిందంటూ’ ఈ లవ్‌ బర్డ్స్‌ షేర్‌ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి..

ఫొటోలతో పాటు 2016 లో వీరి ప్రేమాయణం మొదలు పెట్టినట్లు సీక్రెట్ ను రివిల్ చేసింది.. ఈ ఫోటోలను చూసిన పలువురు అభిమానులు, నెటిజన్లు వీరికి శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు. క్యూట్ జంట, చాలా అందంగా ఉన్నారంటు కామెంట్స్ కూడా పెడుతున్నారు.. అయితే, వీరిద్దరూ కలిసి రెండు సినిమాల్లో నటించారు.. వీరిద్దరూ తెలుగు, తమిళ్ళో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.. కొంతకాలంగా వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి ప్రేమించుకుంటున్నారు. పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం జరిగింది. ఈ యేడాది చివరిలోనే వివాహ వేడుక ఉండే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి..

అందుతున్న సమాచారం ప్రకారం.. వీరి వివాహాన్ని కూడా రాజస్థాన్లోని ఉదయ్ ఘడ్ ప్యాలెస్ లో చాలా ఘనంగా నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్తలు కూడా నిజమయ్యే అవకాశాలు స్పష్టంగా తెలుస్తున్నాయి.. అంతేకాదు.. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.. వీరి వివాహ ఆహ్వాన పత్రికకు ఏకంగా 80 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారని.. ఒక్కొక్క వివాహ పత్రికను బంగారు పూతతో డిజైన్ చేయించినట్లు సమాచారం. ఏదేమైనా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అత్యంత రిచెస్ట్ మ్యారేజ్ లో ఇది కూడా ఒకటి కానుంది.. ఇక గతంలో నిహారిక వివాహన్ని కూడా గ్రాండ్ గా చేశారు నాగబాబు..