NTV Telugu Site icon

Varun Tej: ప్రిన్స్ ఎంగేజ్ మెంట్.. మెగా కుటుంబం స్పందించరేంటి..?

Varun

Varun

Varun Tej: మెగా ఇంట పెళ్లిసందడి మొదలయ్యింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి కొడుకుగా మారబోతున్నాడు. ప్రేమించిన అమ్మాయిని వివాహమాడబోతున్నాడు. సాధారణంగా ఏ పెళ్లి కొడుకు.. పెళ్లి కూతురు అయినా తమ పెళ్లి అనగానే చేసే హడావిడి మాములుగా ఉండదు. నిశ్చితార్థం కు ముందే షాపింగ్, గిఫ్ట్స్, నగలు అంటూ సందడి చేస్తారు. ఇక ఇండస్ట్రీలో పెళ్లి అంటే సోషల్ మీడియాలో నిత్యం ఫోటోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తారు. కానీ.. వరుణ్ బాబు పెళ్లిలో అలాంటివేమీ కనిపించడం లేదు. వరుణ్ తేజ్.. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్ళాడుతున్న విషయం తెల్సిందే. గత కొన్నిరోజులుగా వీరి నిశ్చితార్థం జూన్ 9 న జరుగుతుందని వార్తలు వచ్చాయి.. నేటి ఉదయం ఆ వార్తలు నిజమే అని ఇండస్ట్రీ పీఆర్ టీమ్ లు కూడా చెప్పుకొచ్చాయి. అయితే వీరు చెప్పఁడమే కానీ.. ఈ పెళ్లిపై వరుణ్ తేజ్ కుటుంబం కానీ, లావణ్య త్రిపాఠి కుటుంబం కానీ అధికారికంగా చెప్పుకొచ్చింది లేదు.

Faahad: పుష్ప విలన్ తో సలార్ ప్రొడ్యూసర్ సినిమా… ట్రైలర్ అదిరింది

కనీసం పెళ్లి చేసుకోబోతున్న జంట కూడా తమ నిశ్చితార్దానికి సంబంధించిన ఊసే ఎత్తుతున్నది లేదు. పోనీ సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారా అంటే అది లేదు.. వరుణ్ తన సినిమాకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేస్తున్నాడు.. లావణ్య వెకేషన్ లో ఉన్న ఫోటోలను షేర్ చేస్తుంది కానీ, ఈ పెళ్లి గురించి ఒక్క మాట కూడా చెప్పింది లేదు. చిరంజీవి, నాగబాబు, నిహారిక.. ఇలా ఒక్కరు కూడా అధికారికంగా కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్పింది లేదు. అసలు మెగా ఇంట ఏం జరుగుతుంది అనేది ఎవరికి అర్ధం కావడం లేదు. అయితే మరికొందరు మాత్రం.. బాలీవుడ్ స్టైల్ ను మెగా ఫ్యామిలీ ఫాలో అవుతున్నారని.. కత్రినా-విక్కీ పెళ్లి చివరి వరకు ఎలా సస్పెన్స్ గా జరిగిందో.. ఈ పెళ్లిని కూడా అలాగే చేస్తున్నారని అంటున్నారు. కానీ, ఎంగా అభిమానులు మాత్రం చిరు కానీ, నాగబాబు కానీ.. ఈ పెళ్లి గురించి అధికారికంగా స్పందిస్తే బావుంటుందని అభిప్రాయపడుతున్నారు.

Show comments