మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముకుంద సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. నాగబాబు తనయుడి గా మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా ముకుంద తో బాగానే ఆకట్టుకున్నాడు. కానీ ఆ సినిమా కమర్షియల్ గా హిట్ అవ్వలేదు. ఆ సినిమా తరువాత వరుణ్ తేజ్ సెలెక్టివ్ గా సినిమాలు ఎంచుకుని టాలీవుడ్ లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తన కెరీర్‌లో గని సినిమా బిగ్గెస్ట్ ప్లాప్ గా నిలిచింది.. గతేడాది సమ్మర్‌లో విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆకట్టుకోలేదు.. కనీసం ఈ సినిమా పబ్లిసిటీ ఖర్చులు కూడా రాబట్టలేకపోయింది..ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ ప్రత్యేకించి బాక్సింగ్ శిక్షణ తీసుకుని రెండేళ్లు ఎంతో కష్టపడ్డాడు. కానీ గని సినిమా విడుదల అయిన మొదటి షో నుండే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. కిరణ్ కొర్రపాటి ఈ సినిమాను తెరకెక్కించాడు.మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడు బాబీ వేరొక నిర్మాతతో కలిసి ఎంతో గ్రాండ్ గా ఈ సినిమాను నిర్మించాడు. సునీల్ శెట్టి,ఉపేంద్ర వంటి స్టార్ కాస్ట్ ఉండటతో రిలీజ్ కి ముందు ఈ సినిమాపై ఓ రేంజ్‌లో హైప్ ఏర్పడింది.కానీ విడుదల అయ్యాక ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది.అయితే తాజాగా ఈ సినిమా డిజాస్టర్ అవవ్వడానికి కారణాలేంటో వరుణ్ తేజ్ తెలిపారు..
గని సినిమా నా మొదటి ఫ్లాప్ ఏమి కాదు ఇంతకుముందు కూడా కొన్ని ప్లాప్స్ ఎదురయ్యాయి. మిస్టర్ సినిమా ఫ్లాప్ అయ్యాక నేను తప్పెక్కడ జరిగిందో విశ్లేషించుకుని దాన్ని సవరించుకున్నాను.. ఆ తర్వాత నా నుంచి ఫిదా, తొలి ప్రేమ లాంటి మంచి సినిమాలు వచ్చాయి. అలాగే గని విషయంలో కూడా తప్పెక్కడ జరిగిందో విశ్లేషించుకున్నాను. గని ఒక స్పోర్స్ డ్రామా. కానీ అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాను ఆదరించాలని ఆ కథను కమర్షియల్ సినిమాగా తెరకెక్కించారు.దీనితో అక్కడే తేడా కొట్టేసింది. నిజానికి ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసుకున్నపుడే గని ఫ్లాప్ అవుతుందని అనుకున్నాను. కానీ ఏదైనా అద్భుతం జరుగుతుందేమో అని చిన్న ఆశ నాకు కలిగింది.కానీ అలా ఏమీ జరగలేదంటూ గని ఫ్లాప్ గురించి వివరణ ఇచ్చాడు.ప్రస్తుతం వరుణ్ నటించిన గాండీవధారి అర్జున్ ఆగస్టు 25 న ఎంతో గ్రాండ్ గా విడుదల కాబోతుంది.ఉంది. ప్రవీణ్ సత్తారు ఈ సినిమాను తెరకెక్కించారు.ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన పోస్టర్స్ , ట్రైలర్ ఎంతో ఆకట్టుకున్నాయి. మరి ఈ సినిమాతో వరుణ్ తేజ్ మళ్ళీ ఫామ్ లోకి వస్తాడో లేదో చూడాలి.