Varun Tej : ‘ఎన్టీఆర్‌ను టార్గెట్ చేయలేదు’.. ట్రోల్స్‌పై వరుణ్ తేజ్ క్లారిటీ..

  • ఎన్టీఆర్ ఇమిటేషన్ వివాదంపై వరుణ్ తేజ్ స్పందన
  • 'ఆ సీన్ గతేడాదే షూట్ చేశాం' అంటూ వివరణ
  • ట్రోలింగ్‌కు, ఇమిటేషన్‌కు తేడా ఉందన్న హీరో
  • 'నా కొడుకు నాకు లక్' అంటూ లావణ్యపై ఆసక్తికర వ్యాఖ్యలు
Varun Tej

Varun Tej

Varun Tej : నటుడు వరుణ్ తేజ్ తాజాగా నటించిన ‘కొరియన్ కనకరాజు’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ యూవీ క్రియేషన్స్ ఆఫీస్‌లో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలో పాల్గొన్న వరుణ్ తేజ్, ఇటీవల నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైన ఎన్టీఆర్ ప్రాచీన డైలాగ్ ఇమిటేషన్ వివాదంపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. సినిమాలోని ఆ సన్నివేశాన్ని కావాలని ప్లాన్ చేసి తీసింది కాదని, నిజానికి దానిని గతేడాది నవంబర్‌లోనే షూట్ చేశామని వెల్లడించారు. తాము ప్రమోషన్లలో భాగంగా సీనియర్ నటులు కృష్ణ గారిని కూడా ఇమిటేట్ చేశామని, ట్రోలింగ్ చేయడానికి , ఇమిటేషన్ చేయడానికి చాలా వ్యత్యాసం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

తమకు ఏ నటుడి పట్ల కానీ, సీనియర్ల పట్ల కానీ ఎలాంటి గౌరవభంగం తలపెట్టే ఉద్దేశం లేదని వరుణ్ తేజ్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ గారి డైలాగ్‌ను కేవలం వినోదం కోసమే ఇమిటేట్ చేశామని, ఎవరినీ ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఎవరినీ కించపరచాలనే ఆలోచన తమకు లేదని చెబుతూ, ప్రేక్షకులు ఈ విషయాన్ని అర్థం చేసుకుని వివాదానికి ఇక్కడితో తెరదించాలని ఆకాంక్షించారు. లావణ్య చాలా హ్యాపీ ఈ సక్సెస్ తరువాత నా కొడుకు నాకు లక్ గా ఫీల్ అవుతున్నా అని వరుణ్ అన్నారు.