Varun Tej : వరుణ్ తేజ్ తన కొడుకుతో మొదటిసారి దీపావళి వేడుకలు నిర్వహించుకున్నాడు. లావణ్యతో పాటు మెగా ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకలో పాల్గొంది. మెగా బ్రదర్ నాగబాబు, ఆయన సతీమణి, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి సంప్రదాయ బట్టల్లో మెరిశారు. నాగబాబు తన మనవడితో కలిసి మొదటిసారి దీపావళి వేడుకలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మనవడు వచ్చాక నాగబాబు ఇంట్లో మొదటిసారి దీపావళి వేడుకలు కావడంతో భారీగా ఏర్పాట్లు చేశారు. ఇక కొడుకును ఎత్తుకుని వరుణ్, లావణ్య మురిసిపోతున్నారు. అటు నాగబాబు, ఆయన సతీమణి కూడా మనవడిని ఎత్తుకుని ఫొటోలు దిగారు.
Read Also : Naga Chaitanya : నాగచైతన్య, శోభిత దీపావళి సెలబ్రేషన్స్.. పిక్స్ చూశారా
సంప్రదాయ బట్టల్లో ఫ్యామిలీ మొత్తం మెరిసిపోతోంది. ఇంకేముంది మెగా ఫ్యాన్స్ ఈ ఫొటోలను తెగ షేర్ చేస్తూ లైకులు కొట్టేస్తున్నారు. ప్రస్తుతం వరుణ్ మేర్లపాక గాంధీతో సినిమా చేస్తున్నాడు. మట్కా లాంటి ప్లాప్ తర్వాత ఈ సారి కచ్చితంగా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఉన్నాడు వరుణ్. ఈ సినిమాతో పాటు మరో రెండు మూవీలను లైన్ లో ఓ పెట్టేశాడు. అటు లావణ్య పెళ్లి తర్వాత సినిమాలను చాలా వరకు తగ్గించేసింది. రీసెంట్ గా ఆమె నటించిన ఓ వెబ్ సిరీస్ ఓటీటీలో వచ్చేసింది. మరి దీని తర్వాత ఆమె కంటిన్యూగా సినిమాలు చేస్తుందా లేదా అనేది చూడాలి.
Read Also : Tharun Bhaskar : రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ తో డైరెక్టర్ తరుణ్ భాస్కర్.. ఏదో జరుగుతోందిగా..
