Varun Sandesh’s ‘Nindha’ Sankellu Song Unveiled by Specially abled kids: ఒకప్పుడు యూత్ ను ఒక ఊపు ఊపిన హీరో వరుణ్ సందేశ్ ప్రస్తుతం ‘నింద’ సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్, టీజర్ సినిమా మీద అంచనాలు పెంచేయగా ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. గానామాస్ స్పెషల్ స్కూల్‌కి చెందిన పిల్లలు ఈ పాటను విడుదల చేయడం గమనార్హం.
Amma Rajasekhar : హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న అమ్మ రాజశేఖర్ తనయుడు..
కిట్టూ విస్సాప్రగడ రాసిన సాహిత్యం, సంతు ఓంకార్ ఇచ్చిన బాణీ.. శ్రీరామచంద్ర పాడిన తీరు అద్భుతంగా ఉంది. పాటను వింటే ఉత్తేజ భరితంగా, ఆలోచన రేకెత్తించే విధంగా ఉంది. శ్రియ రాణి, ఆనీ, క్యూ మధు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో తనికెళ్ల భరణి, భద్రమ్, సూర్యకుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో శ్రీరామసిద్ధార్థ కృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. రమీజ్ నవీత్ సినిమాటోగ్రాఫర్‌గా, అనిల్ కుమార్ ఎడిటర్‌గా పని చేశారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు. సంగీతం సంతు ఓంకార్ అందించిన ఈ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ అర్చన రావు.