యంగ్ హీరో నాగ శౌర్య, రీతు వర్మ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘వరుడు కావలెను’ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి ఈ సినిమా అక్టోబర్ 15న విడుదల కావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల వాయిదా పడి ఎట్టకేలకు అక్టోబర్ 29న థియేటర్లలోకి వచ్చింది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు కావడంతో లాస్ట్ మినిట్ లో మంచి హైప్ వచ్చింది. ఇక ‘వరుడు కావలెను’ సినిమా ప్రీమియర్ షోస్ ఇప్పటికే అమెరికా లాంటి దేశాల్లో ప్రదర్శితమయ్యాయి. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
Read Also : పిక్ వైరల్ : ఆర్యన్ కు బెయిల్… లీగల్ టీంకు షారుఖ్ పార్టీ
ప్రస్తుతానికి సినిమాపై మిక్స్డ్ టాక్ నడుస్తోంది. సినిమా యావరేజ్ గా ఉందని కొందరు అంటే, మరికొందరు మాత్రం పర్లేదు అని అంటున్నారు. మొత్తానికి సినిమాలో పాటలు, స్క్రీన్ ప్రెజెన్స్, హీరో హీరోయిన్ ఫెయిర్ ఫ్రెష్ గా అనిపిస్తుందని అంటున్నారు. సినిమా లో మ్యూజిక్, కొన్ని సీన్లు, ప్రొడక్షన్ వాల్యూస్ హైలెట్ అని టాక్. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు మెయిన్ హైలెట్ అని, అక్కడ వచ్చే 15 నిమిషాల సన్నివేశాలు ప్రేక్షకులను ఎమోషన్స్ తో కట్టిపడేస్తాయి అని తెలుస్తోంది. సినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూ వచ్చే దాక వెయిట్ చేయాల్సిందే.
ఈ సినిమాను లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహించగా, సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం విశాల్ చంద్ర శేఖర్ అందించారు.
