Varsha Bollamma: ఆ హీరోయిన్లు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్నారు. ఒక పెద్ద హిట్ వచ్చింది లేదు.. స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకున్నది లేదు. కెరీర్ లో ఇప్పుడిప్పుడే సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తున్న వారిపై బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారని కొంతమంది నెటిజన్లు విమర్శిస్తున్నారు. అసలు ఆ హీరోయిన్లు ఏంటి..? బురద జల్లడమేంటీ అంటే.. టాలీవుడ్ లో డబ్బింగ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది వర్ష బొల్లమ్మ. కలువల్లాంటి కళ్ళు.. జూనియర్ నజ్రియా లా ఉండడంతో అమ్మడికి టాలీవుడ్ లో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఇటీవలే బెల్లంకొండ వారసుడు గణేష్ మొదటి సినిమా స్వాతి ముత్యం సినిమాలో హీరోయిన్ గా నటించి తనదైన గుర్తింపును అందుకొంది. ఇక ఇప్పుడిప్పుడే అవకాశాలను అందుకుంటున్న ఈ చిన్నది అప్పుడే పెళ్లి చేసుకోని సెటిల్ అయిపోతుందంటూ వార్తలు గుప్పుమన్నాయి.
ప్రముఖ సీనియర్ నిర్మాత కొడుకు, వర్షపై మనసు పడ్డాడని, కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోవడంతో త్వరలోనే వర్ష పెళ్లి కూతురు కాబోతుందని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక ఇదే విధంగా మొన్న తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ళ కూడా ఒక ప్రముఖ నిర్మాతకు కోడలిగా వెళ్లనున్నదని వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ వార్తలపై అనన్య రియాక్ట్ అయ్యి అవి పుకార్లు అని చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు వర్ష వంతు వచ్చింది అని అంటున్నారు. చక్కగా కెరీర్ సెట్ చేసుకుంటున్న కుర్ర హీరోయిన్లకు, నిర్మాతల కొడుకులతో పెళ్లి అని రూమర్స్ క్రియేట్ చేసి వారిపై బురద చల్లుతున్నారని చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా ఈ వార్తలపై వర్ష సైతం మౌనం వహించకుండా నోరు మెదిపితే మంచిదని మరికొందరు అంటున్నారు.