Site icon NTV Telugu

Bad Girl: ‘బ్యాడ్‌ గర్ల్‌’ అశ్లీలం కాదు..వివాదం పై స్పందించిన వార్షా భరత్

Badgirl

Badgirl

సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బ్యాడ్ గర్ల్’ సినిమా విడుద‌లతో పాటు వివాదాలు, విమర్శలు, కోర్టు తీర్పులు అన్నీ ఎదుర్కొన్నది. ఈ నేపథ్యంలో, దర్శకురాలు వర్షా భరత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి స్పష్టత ఇచ్చారు.

Also Read : Sai Pallavi : బికినీలో ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన సాయి ప‌ల్లవి..

వర్షా భరత్ మాట్లాడుతూ.. ‘ ‘బ్యాడ్ గర్ల్’ టీజర్ విడుదలైన తర్వాత దీన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్‌డ్యామ్ లో ప్రదర్శించాం. అక్కడ అవార్డును సొంతం చేసుకున్నాం, ప్రశంసలు కూడా లభించాయి. కానీ ఇక్కడ కొన్ని విమర్శలు వచ్చాయి, ఈ సినిమా చెత్తగా ఉందని, అశ్లీలం అని అనుకున్నారు. అంతర్జాతీయ ప్రేక్షకులు మాత్రం దీన్ని గుర్తించారు. అది నా కోసం దిక్కుతోచని అనుభవం గా నిలిచింది. ” అని తెలిపారు. తమిళ్ లో రిలీజ్ అయిన తర్వాత వచ్చిన పాజిటివ్ రివ్యూలు ఆమెకు ధైర్యం కలిగించాయని, సినిమా విడుదలపై వారం తర్వాత కుటుంబ సభ్యులను థియేటర్‌కి తీసుకెళ్లినప్పుడు వారు విమర్శించలేదని చెప్పి, ప్రజల ఆలోచన తీరు అర్థమైంది అని వర్షా చెప్పారు.

ఇక మూవీ అసలు కథ విషయానికి వస్తే అంజలి శివరామన్ ప్రధాన పాత్రలో నటించారు. శాంతిప్రియ కీలక పాత్ర పోషించారు. సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన రమ్య సరైన జీవిత భాగస్వామిని ఎంచుకునే క్రమంలో ఎదుర్కొన్న సమస్యల కథే ‘బ్యాడ్ గర్ల్’. వర్షా భరత్ ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయమయ్యారు. వర్షా స్పష్టం చేసినట్లుగా, సినిమా సమాజానికి, కుటుంబ సంప్రదాయాలకు సవాల్ విసరడం మాత్రమే అని.. అది ఎలాంటి అశ్లీలం కాదని ఆమె హైలైట్ చేశారు.

Exit mobile version