వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే రామ్ గోపాల్ వర్మ లాక్‌డౌన్, కరోనా సమయంలోనూ తనదైన శైలిలో కొన్ని సినిమాలు తీశాడు. తాజాగా దిశ హత్యోదంతపైనా 'ఆశ' పేరుతో ఓ మూవీని తీసి, జనవరి 1న విడుదల చేశాడు. `బ్యూటీపుల్’ ఫేమ్ నైనా గంగూలీ, ‘థ్రిల్లర్’ బ్యూటీ అప్సర రాణి ప్రధాన పాత్రల్లో 'డేంజరస్' పేరుతో వర్మ ఆ మధ్య ఓ మూవీ తెరకెక్కించాడు. ఇది ఇండియాలోనే తొలి లెస్బియన్ క్రైమ్ యాక్షన్ ఫిల్మ్ అని, ఈ లెస్బియన్స్ ఎఫైర్ చాలా మందిని చంపేసిందని, వారిలో పోలీసులు, గ్యాంగ్‌స్టర్స్ కూడా ఉన్నారని వర్మ అప్పట్లో చెప్పుకొచ్చాడు.
ఇక ఇప్పుడీ సినిమా హిందీ వర్షన్ ‘ఖత్రా’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు కట్స్ తో ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. సెన్సార్ సర్టిఫికెట్ ను వర్మ ట్వీట్ చేస్తూ విడుదల తేదీని త్వరలోనే తెలియచేస్తానని అన్నారు. ఈ చిత్రానికి సెన్సార్ వారు ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చి ఉండకపోతే తాను చాలా నిరుత్సాహానికి గురయ్యే వాడినని వర్మ చెప్పారు. గౌరవ సుప్రీమ్ కోర్టు సెక్షన్ 377 ను సవరించిన తర్వాత వస్తున్న భారతదేశపు మొట్టమొదటి లెస్బియన్ నేపథ్య చిత్రం ఇదేనని వర్మ అంటున్నారు.
