Site icon NTV Telugu

Dil Raju: చెప్పి మరీ హిట్ కొట్టాడు…

Varisu

Varisu

దిల్ రాజు బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే మినిమమ్ గ్యారెంటీ హిట్ అనే నమ్మకం ప్రతి తెలుగు సినీ అభిమానుల్లో ఉంది. స్టార్ హీరోస్ తో సినిమాలని చెయ్యడంతో పాటు కంటెంట్ ని కూడా నమ్మి సినిమాలు ప్రొడ్యూస్ చెయ్యడంలో ముందుండే దిల్ రాజు, టాలీవుడ్ నుంచి కోలీవుడ్ హిట్ కొట్టడానికి వెళ్లారు. అక్కడి స్టార్ హీరో దళపతి విజయ్ తో ‘వారిసు’ సినిమాని నిర్మించాడు. వంశీ పైడిపల్లి హీరోగా నటించిన వారిసు మూవీ ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి వచ్చింది. తెలుగులో వారసుడు పేరుతో మూడు రోజుల డిలేతో రిలీజ్ అయిన ఈ మూవీ సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతోంది. తమిళనాడులో ఎర్త్ శాటరింగ్ కలెక్షన్స్ ని రాబడుతున్న వారిసు సినిమా వరల్డ్ వైడ్ ఇప్పటివరకూ అంటే 7 రోజుల్లో 210 కోట్లని రాబట్టింది. ఒక ఫ్యామిలీ సినిమా ఈ రేంజ్ కలెక్షన్స్ ని రాబట్టడం అనేది మాములు విషయం కాదు.

విజయ్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరోతో ఫ్యామిలీ సినిమా ఎందుకు చేస్తున్నారు, ఇలా అయితే మూవీ ఫ్లాప్ అవుతుంది అని చాలా మంది కామెంట్స్ చేశారు. ఈ మాటల్ని పట్టించుకోని విజయ్ తో అందరిలా రొటీన్ మాస్ మసాలా సినిమా చెయ్యకుండా తన గట్స్ ని మాత్రమే నమ్మి ఫ్యామిలీ సినిమా చేశాడు దిల్ రాజు. తన నమ్మకమే తనని గెలిపిస్తుంది అనే మాట ఇప్పుడు దిల్ రాజు విషయంలో నిజమయ్యింది. ఫ్యామిలీ సినిమా పండగ సీజన్ లో రిలీజ్ అయితే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారు, చాలా రోజులుగా విజయ్ మాస్ సినిమాలు మాత్రమే చేస్తున్నాడు కాస్త సెంటిమెంట్ టచ్ ఇస్తే కొత్తగా ఉంటుంది అని దిల్ రాజు పెట్టుకున్న నమ్మకమే వారిసు విజయానికి కారణం అయ్యింది. వారసుడు సినిమా తెలుగులో మూడు రోజుల డిలేతో రిలీజ్ అయినా కూడా మంచి కలెక్షన్స్ నే రాబడుతోంది. బ్రేక్ ఈవెన్ మార్క్ ని రీచ్ అయ్యి ప్రాఫిట్స్ జోన్ లోకి ఎంటర్ అవుతుంది. వారిసు విజయం దిల్ రాజుని కోలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ ని చేస్తుందేమో చూడాలి.

Exit mobile version