Site icon NTV Telugu

Balayya: థియేటర్స్ పెరుగుతున్నాయి.. కలెక్షన్స్ కూడా

Veera Simha Reddy

Veera Simha Reddy

దళపతి విజయ్ నటిస్తున్న ‘వారసుడు’ సినిమా, నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘వీర సింహా రెడ్డి’ సినిమా ఒకే రోజున రిలీజ్ అవుతున్నాయి అనే న్యూస్ బయటకి రాగానే తెలుగు సినీ అభిమానులు, ముఖ్యంగా నందమూరి అభిమానులు కంగారు పడ్డారు. బాలయ్య సినిమాకి ఎక్కువ థియేటర్స్ దొరకవేమో, థియేటర్స్ కౌంట్ తక్కువ ఉంటే ఓపెనింగ్స్ సరిగ్గా రావేమో అనే లెక్కలు వేస్తూ నందమూరి అభిమానులు టెన్షన్ పడ్డారు. వీర సింహా రెడ్డి ట్రైలర్ చూసిన తర్వాత బాలయ్యకి పోటీగా ఏ సినిమా వచ్చిన భయపడాల్సిన అవసరం లేదని అందరూ కాన్ఫిడెన్స్ లోకి వచ్చారు కానీ థియేటర్స్ విషయంలో మాత్రం తక్కువ కేటాయిస్తున్నారు అనే ఆలోచన ప్రతి ఒక్కరికీ ఉంది.

ఈ ఆలోచనని పూర్తిగా తీస్తూ ‘వారసుడు’ సినిమా జనవరి 11న కాకుండా 14న విడుదల చేస్తున్నాం అంటూ దిల్ రాజు అనౌన్స్ చేశాడు. దీంతో దిల్ రాజు ‘వారసుడు’ సినిమా కోసం బ్లాక్ చేసిన థియేటర్ ఓపెన్ అయ్యాయి. ఈ థియేటర్స్ లోకి ఇప్పుడు వీర సింహా రెడ్డి వచ్చి చేరే అవకాశం ఎక్కువగా ఉంది. దీని కారణంగా బాలయ్య సినిమాకి ఓపెనింగ్స్ పెరగనున్నాయి. ఫస్ట్ డే ఎక్కువ థియేటర్స్ వస్తే అది సినిమా కలెక్షన్స్ ని ఎంత హెల్ప్ అవుతుంది అనే విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. జనవరి 12న బాలయ్య హిట్ టాక్ సాదిస్తే, 13న రిలీజ్ కానున్న చిరు ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి థియేటర్స్ కౌంట్ లో డిఫరెన్స్ కనిపించే ఛాన్స్ ఉంది. ఒకవేళ బాలయ్య యావరేజ్, చిరు హిట్ టాక్ సాదిస్తే… వీర సింహా రెడ్డి థియేటర్స్ లో కొన్ని వాల్తేరు వీరయ్యకి వెళ్తాయి. అది చిరు సినిమాకి కలిసొస్తుంది, ఈ గ్యాప్ లో ఫస్ట్ డే బాలయ్య ఇప్పటివరకూ వేసుకున్న ప్రిడిక్షన్స్ కన్నా ఎక్కువ వసూల్ చెయ్యడం అయితే గ్యారెంటీ.

Exit mobile version