Site icon NTV Telugu

Varanasi : వామ్మో.. వారణాసి ఈవెంట్ కు అన్ని కోట్లు పెట్టారా..?

Varanasi

Varanasi

Varanasi : వరుస విజయాలతో ముందుకు సాగుతున్న టాలీవుడ్ స్టార్స్ కొత్త సినిమా ఈవెంట్లను భారీ స్థాయిలో ప్లాన్ చేయడం కొత్తేమీ కాదు. కానీ నిన్న జరిగిన వారణాసి ఈవెంట్ మాత్రం వేరే లెవల్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఇలాంటి ఈవెంట్ ప్లాన్ చేయలేదు. అంత పెద్ద స్క్రీన్ వేసి, పాస్ పోర్టులు జారీ చేసి.. ముందు నుంచే ప్లాన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈవెంట్‌ స్కేల్‌, సెటప్‌, టెక్నికల్ రేంజ్ చూసిన వారంతా వావ్ అంటున్నారు. ఇక ఈవెంట్ సెట్ అయితే మామూలగా లేదనే చెప్పుకోవాలి.

Read Also : Aditi Rao Hydari : వాడిని నమ్మి మోసపోవద్దు.. అదితి రావు హైదరీ కామెంట్స్

మరీ ముఖ్యంగా ఎల్ఈడీ స్క్రీన్ గురించే చర్చ జరుగుతోంది. 100×130 అడుగుల భారీ ఎల్ఈడీ స్క్రీన్ ను సెట్ వేశారు. దీనిపైనే మూవీ టైటిల్, గ్లింప్స్ వేసి చూపించారు. ఈ ఒక్క స్క్రీన్ కోసమే రూ.30 లక్షల దాకా ఖర్చు చేశారంట. ఇక మొత్తం ఈవెంట్ కోసం ఎల్ ఈడీ లైట్లు, సౌండ్‌, క్రౌడ్ మేనేజ్‌మెంట్, సెక్యూరిటీ, స్పెషల్ ఎఫెక్ట్స్, ప్రమోషనల్ క్రియేషన్స్‌ ఇవన్నీ కలుపుకుని దాదాపు రూ.10 కోట్లకు పైనే అయిందని సమాచారం. ఈ ఒక్క ఈవెంట్ బడ్జెట్ తో చిన్న సినిమా తీసేయొచ్చు. కాకపోతే రాజమౌళి సినిమా బడ్జెట్, మేకింగ్ కూడా ఆ రేంజ్ లోనే ఉంటాయి కాబట్టి ఈ మాత్రం కామన్ అనేస్తున్నారు మహేశ్ బాబు ఫ్యాన్స్.

Read Also : Pawan Kalyan – Mahesh Babu : మొన్న పవన్ కల్యాణ్‌.. నేడు మహేశ్ బాబు.. అదే రిపీట్

Exit mobile version