Varalakxmi Sarathkumar: కరోనా బారిన పడ్డ బాలయ్య హీరోయిన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varalakxmi Sarathkumar: గత రెండేళ్లుగా పట్టిపీడిస్తున్న కరోనా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది అనుకొనేలోపు చాపకింద నీరులా మళ్లీ విజృంభిస్తోంది. వాతావరణంలో వచ్చిన మార్పులు కారణంగా మరోసారి కరోనా కేసులు పెరుగుతుండడం భయాందోళనలను కలిగిస్తున్నాయి. మొన్నటికి మొన్న తమిళనాడు సీఎం స్టాలిన్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక తాజాగా కోలీవుడ్ స్టార్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
“అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కోవిడ్ పాజిటివ్ అని తెలిసింది. నటీనటులు ప్లీజ్ మొత్తం సిబ్బందికి మాస్కింగ్ చేయాలని పట్టుబట్టడం ప్రారంభించండి. ఎందుకంటే మేము నటులుగా మాస్క్‌లు ధరించలేము. నన్ను కలిసిన వారు లేదా నాతో పరిచయం ఉన్నవారు దయచేసి చెక్ చేసుకోండి. దయచేసి జాగ్రత్తగా ఉండండి, మాస్క్ వేసుకోండి.. కోవిడ్ ఇంకా ఇక్కడ ఉంది” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఆమెను చూస్తుంటే లక్షణాలు తక్కువగానే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు. ఇక వరలక్ష్మీ కెరీర్ విషయానికొస్తే.. ఒకపక్క హీరోయిన్ గా నటిస్తూనే మరోపక్క విలన్ గా మెప్పిస్తోంది. ప్రస్తుతం వరుస తెలుగు మూవీలు చేస్తున్న వరూ.. బాలయ్య- గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న ఎన్బీకే 107 లో నటిస్తోంది. ఇందులో బాలయ్యకు విలన్ గా వరలక్ష్మీ నటిస్తుందని టాక్ నడుస్తోంది. మరి ఈ సినిమాతో వరూ మరో హిట్ ను అందుకుంటుందేమో చూడాలి.
Also Read
- Sardar2 : సర్దార్ -2 ఓవర్సీస్ రివ్యూ.. ఇది మరో సర్దార్ గబ్బర్ సింగ్
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
Varalakxmi sarathkumar Tweet:
Covid Positive..inspite of all precautions..actors plz start insisting on masking up the entire crew bcos we as actors cant wear masks..
Those who have met me or been in contact with me plz watch out for symptoms and get checked..
Plz be careful and mask up..covid is still here pic.twitter.com/MyegWOSQ5a— 𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath5) July 17, 2022
తాజావార్తలు
-
Relationship Blindness: ప్రేమ ఉన్నా మాటలే లేవా?
-
BC Reservations: 34 శాతం బీసీ కోటాపై ఉత్కంఠ.. రిజర్వేషన్ల డేటా సమర్పించాలని సర్కార్‌కు హైకోర్టు ఆదేశం
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
Sardar2 : సర్దార్ -2 ఓవర్సీస్ రివ్యూ.. ఇది మరో సర్దార్ గబ్బర్ సింగ్
-
Samsung Roasts Apple’s First Foldable: యాపిల్ ఫోల్డబుల్‌పై శామ్సంగ్ ఘాటు సెటైర్లు..
ట్రెండింగ్
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!