Site icon NTV Telugu

నా తండ్రి నన్ను గెంటేశాడు.. మూడు పెళ్లిళ్లు నిలవలేదు- హీరోయిన్

vanitha

vanitha

కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీనియర్ హీరోయిన్ మంజులను వివాహమాడి అటు తమిళ్ లోనూ, ఇటు తెలుగులోనూ సుపరిచితుడిగా మారారు. ఇక ఆయన ముగ్గురు కూతుళ్లు కూడా హీరోయిన్లుగా నటించనినవారే. ముఖ్యం వనితా విజయ్ కుమార్ గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. ఆమె వివాదాలు, ఆమె పెళ్లిళ్లు వలన అందరికి ఆమె పరిచయమే. ఇటీవల బిగ్ బాస్ కి వెళ్లి ప్రేక్షకుల మన్ననలు పొందిన వనితా తాజగా ఒక ఇంటర్వ్యూలో తన జీవితంలోని కష్టాలను ఏకరువు పెట్టింది. కన్నతండ్రే తనను బయటికి గెంటేశాడని, జీవితంలో తాను గెలవకూడదని చాలా మంది ప్రయత్నించినట్లు తెలిపింది.

” మా అమ్మ మంజుల ఎంతో కష్టపడి స్టార్ హీరోయిన్ గా పేరుతెచ్చుకొంది. పిల్లల కోసం ఎంతో సంపాదించింది. మా అమ్మకు ముగ్గురు ఆడపిల్లలం.. ఆమె సంపాదించిన ఆస్తి ముగ్గురికి సమానంగా రావాలి. కానీ, మా నాన్న మాత్రం ఆ ఆస్తిలో నాకు చిల్లిగవ్వ కూడా రానివ్వడంలేదు. అమ్మ చనిపోయాక నాపై అయన చాలా క్రూరంగా ప్రవర్తించారు. అమ్మ వాళ్లింట్లో ఉన్న నన్ను అతి దారుణంగా బయటికి గెంటేశాడు.  కట్టుబట్టలతో పిల్లలను తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. ఆయనకు నా మీద ఎందుకు అంత కోపమో నాకు తెలియదు. ఇప్పుడు ఆ కుటుంబంలో ఎవరిని అడిగినా నేను చనిపోయాననే చెప్తారు. నా ఆస్తి కోసం నేను సుప్రీం కోర్టు వరకు వెళ్ళాను.. అప్పుడే నాన్న నాతో ఛాలెంజ్ చేశారు.. తమిళనాడులో నీకు అడ్రెస్స్ లేకుండా చేస్తాను అని అన్నారు. ఇప్పుడు ప్రేక్షకుల ఆదరాభిమానాలతో పేరు తెచ్చుకున్నాను. ఇక నా పెళ్లిళ్ల గురించి చెప్పాలంటే.. చిన్నతనంలోనే పెళ్లి చేసుకోవడం వలన వాటి విలువ తెలియలేదు.. అందుకే అవి నిలవలేదు” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version