NTV Telugu Site icon

కూతురు అయిపోయింది.. ఇప్పుడు హీరోగా లాంచ్ అవుతున్న హీరోయిన్ కొడుకు?

Vanitha Vijaykumar Daughter Jovika Vijaykumar

Vanitha Vijaykumar Daughter Jovika Vijaykumar

Vanitha Vijay Kumar Son to Become Hero: ఈ మధ్యకాలంలో సినిమాల్లో నటించడం కంటే వివాదాస్పద అంశాలతోనే ఎక్కువగా ఫేమస్ అవుతున్నారు కొంతమంది నటీమణులు. అలాంటి వారిలో వనిత విజయ్ కుమార్ కూడా ఒకరు. స్టార్ యాక్టర్ విజయ్ కుమార్ కుమార్తె అయిన ఆమె తెలుగులో దేవి అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా సూపర్ హిట్ అయ్యాక కూడా ఆమెకు పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు, వచ్చిన వాటిని ఆమె పెద్దగా వాడుకోలేకపోయింది. తర్వాత తమిళంలోకి షిఫ్ట్ అయ్యి అక్కడ అడపాద అడపా సినిమాలు చేస్తూ ఉండేది. అయితే చిన్న వయసులోనే ఆమెకు తల్లిదండ్రుల వివాహం చేశారు. ఆ వివాహం పొసగక పోవడంతో ఆమె విడాకులు ఇచ్చి రెండో వివాహం చేసుకున్నారు. అది కూడా సెట్ అవ్వకపోవడంతో మూడో వివాహం కూడా చేసుకున్నారు. అతనితో కూడా విభేదాలు రావడంతో విడిపోయి తన పిల్లలతో జీవిస్తున్నారు.

RCB Fans: ఒక్క కప్ గెలవకపోయిన ఇంత క్రేజ్ ఏంటయ్యా.. డిగ్రీ పట్టా తీసుకుంటూ ఆర్సీబీ జెండా, జెర్సీతో పోజులు..

ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇప్పటికే ఆమె కూతురు జోవికా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. వనిత కుమార్తె జోవిక దర్శకుడు మరియు నటుడు పార్తిబన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టీన్స్ చిత్రంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసింది. ఇప్పుడు వనిత కొడుకు హీరోగా మారే ప్రయత్నం చేస్తున్నాడు. నటి వనిత, ఆమె మొదటి భర్త ఆకాష్‌కి విజయ్ శ్రీ హరి జన్మించారు. విజయ్ శ్రీ హరి సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నాడు. ఈ స్థితిలో విజయ్ శ్రీ హరి హీరోగా తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. కుమ్కి, మైనా వంటి సూపర్‌హిట్ చిత్రాలను అందించిన ప్రభు సాలమన్ దర్శకత్వంలో వనిత పెద్ద కుమారుడు విజయ్ శ్రీ హరి హీరోగా తెరంగేట్రం చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా తొలి దశ షూటింగ్ థాయ్‌లాండ్‌లో జరుగుతుందని, రోజా కంబైన్స్ ద్వారా కాజా మొయినుద్దీన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని చెబుతున్నారు.

Show comments