Vamsi Paidipally: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, రష్మిక జంటగా తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వారసుడు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తెలుగు, తమిళ్ లో కూడా ఈ సినిమా సీరియల్ లా అనిపిస్తోందని, ల్యాగ్ ఎక్కువ అవ్వడమే కాకుండా కుటుంబ కథా చిత్రమని, విజయ్ తో వంశీ సీరియల్ తీశాడని ట్రోల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా తమిళ్ తంబీలు.. తెలుగు డైరెక్టర్ ను ఆడుకుంటున్నారు. తెలుగు సీరియల్ ను తమిళ్ వారికి ఇచ్చాడంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ ట్రోల్స్ పై వంశీ గట్టిగా ఫైర్ అయ్యాడు. తమ సినిమాను సీరియల్ అని ఎలా అంటారని, ఒక సినిమా ఎంతమంది కష్టమో మీకు తెలుసా..? అని మండిపడ్డాడు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. “సీరియల్, సీరియల్ అంటున్నారు.. అసలు సీరియల్ ను అంత డీగ్రేడ్ చేసి ఎలా మాట్లాడతారు. అసలు సీరియల్ అంటే అంత తక్కువ అని ఎవరు చెప్పారు. ఎంతోమంది మహిళలకు సాయంత్రం ఎంటర్ టైన్ చేసేవి సీరియల్స్..సినిమా లాగే సీరియల్ కూడా క్రియేటివ్ వర్క్. అయినా ఒక సినిమాను సీరియల్స్ తో ఎలా పోలుస్తారు. వారు పడిన కష్టం ఎలాంటిదో మీకు తెలుసా.,.? విజయ్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో తెలుసా..? నిర్మాతలు ఈ సినిమా కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలుసా..? సినిమా సీరియల్ లా ఉందని ఎలా పోల్చి చెబుతారు అంటూ సీరియస్ అయ్యారు. ఫైనల్ జడ్జిమెంట్ అనేది ప్రేక్షకుల నుంచి వస్తుంది. అది అసలైన రివ్యూ. మేము దాన్ని అంగీకరిస్తాం. మీరెలా సీరియల్ లా ఉందని రివ్యూలు రాస్తారు.అసలు సినిమా సిరియా ఉందని మీరెలా జడ్జ్ చేస్తారు.. ఇది పద్దతి కాదు” అంటూ మండిపడ్డాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.