NTV Telugu Site icon

Valentine’s Day Movies: ప్రేమికుల రోజున కల్ట్ సినిమా రీరిలీజ్…

96

96

ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే… ఈ ప్రేమికుల రోజున లవర్స్ ని థియేటర్స్ కి రప్పించడానికి రెడీ అవుతున్నాయి ఒకప్పటి క్లాసిక్ లవ్ స్టోరీస్. ఇప్పటికే తెలుగు నుంచి ఓయ్… సినిమా బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ గా రీరిలీజ్ కి రెడీ అవుతోంది. సిద్దార్థ్, బేబీ షామిలి నటించిన ఓయ్ సినిమా చాలా మంది ఆడియన్స్ కి ఫెవరెట్ ఫిల్మ్. ఆనంద్ రంగ డైరెక్ట్ చేసిన ఈ క్లాసిక్ సినిమా రీరిలీజ్ అవుతుంది అనగానే మూవీ లవర్స్ థియేటర్స్ కి వెళ్ళడానికి రెడీ అయిపోయారు. ఇప్పుడు కోలీవుడ్ నుంచి కూడా లవర్స్ కోసం ఒక క్లాసిక్ సినిమా రీరిలీజ్ అవడానికి రెడీ అయ్యింది.

మక్కల్ సెల్వం విజయ్ సేతుపతి, తలైవి త్రిష కలిసి నటించిన సినిమా 96. ఒక ప్యూర్ క్లాసిక్ లవ్ స్టోరీగా పేరు తెచ్చుకున్న ఈ సినిమా చాలా మంది నిజ జీవితాలకి దగ్గరగా ఉంటుంది. తమిళ సినిమాగానే రిలీజైన 96 పాన్ ఇండియా మొత్తం పేరు తెచ్చుకుంది. భాషతో సంబంధం లేకుండా ఆడియన్స్ 96 సినిమాని చూసి ఎంజాయ్ చేసారు. త్రిష, సేతుపతి సెకండ్ హాఫ్ లో 96 సినిమాకి ప్రాణం పోశారు. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆల్ టైమ్ గ్రేటెస్ట్ లవ్ స్టోరీస్ జానర్ సినిమాల్లో 96 టాప్ ప్లేస్ లో ఉండే పేరు తెచ్చుకుంది. ఇలాంటి సినిమా ఇప్పుడు ఫిబ్రవరి 14న రీరిలీజ్ అవుతుంది అంటూ సేతుపతి రివీల్ చేసాడు. అయితే తమిళ రిలీజ్ మాత్రమే ఉంటుందా లేక తెలుగులో కూడా తమిళ వెర్షన్ ని రీరిలీజ్ చేస్తారా అనేది చూడాలి. తెలుగులో కూడా 96 తమిళ వర్షన్ ని రీరిలీజ్ చేస్తే లవర్స్ థియేటర్స్ కి క్యూ కట్టేయడం గ్యారెంటీ.

Show comments