NTV Telugu Site icon

Vakeel Saab: థియేటర్లలోకి వకీల్ సాబ్ మళ్ళీ వస్తున్నాడు

Vakeel Saab on Amazon Prime : Dil Raju pocketing Rs 12 crores

Vakeel Saab Re-release In Cinemas on May Day: అజ్ఞాతవాసి అనంతరం మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత పవన్ కళ్యాణ్..వకీల్ సాబ్ చిత్రంతో రీ లాంచ్ అయ్యి సూపర్ హిట్ కొట్టారు. భాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షం కురుస్తున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ వలన సినిమాకి బ్రేక్ పడింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ ఏప్రిల్ 9 2021న రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో మంచి టాక్ తెచ్చుకుంది. బాలీవుడ్ లో బిగ్ బీ అమితాబ్ నటించిన పింక్ రీమేక్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా తెలుగు అండ్ తమిళ బాషల్లో రీమేక్ అవగా ఐఎండీబీ రేటింగ్స్ లో వకీల్ సాబ్ సినిమాకే టాప్ రేటింగ్ వచ్చింది.

Anupama: చెప్పినట్టుగానే ‘పరదా’ తొలగించుకు వస్తున్నా.. అనుపమ కీలక వ్యాఖ్యలు

ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్ తెలుగుకు అనుగుణంగా మార్పులు చేశారు. ముఖ్యంగా థమన్ అందించిన సంగీతం ఈ సినిమా విజయానికి కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో మగువ మగువ సాంగ్ మంచి ఆదరణ దక్కించుకుంది. ఇక ఈ సినిమాలో అంజలీ, అనన్య, నివేద థామస్ కీలక పాత్రలో నటించగా శృతిహాసన్ చిన్న పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో పవన్ స్టైల్ కు ఆయన చెప్పిన డైలాగ్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. పవన్ కు ఈ సినిమా పర్ఫెక్ట్ కం బ్యాక్ అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఈ సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇక మే నెల 1వ తేదీన అంటే బుధవారం నాడు ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.

Show comments