NTV Telugu Site icon

Vaishnavi Chaitanya: బేబీ పాప.. ముగ్గేస్తూ.. అబ్బాయిలను ముగ్గులోకి దింపుతుందే

Vaish

Vaish

Vaishnavi Chaitanya: బేబీ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో స్టార్ గా మారిపోయింది వైష్ణవి చైతన్య. ఒక యూట్యూబర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి.. స్టార్ హీరోల సినిమాల్లో చెల్లెలిగా నటించి.. బేబీ సినిమాతో హీరోయిన్ గా మారింది. ఈ ఒక్క సినిమా అమ్మడి జాతకాన్ని మార్చేసింది. ఇద్దరు ప్రియులను మోసం చేసి.. మరొకరిని పెళ్లి చేసుకున్న అమ్మాయిగా వైష్ణవి నటన నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఈ సినిమా తరువాత వైష్ణవి స్టార్ హీరోల సరసన నటిస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు సినిమాలకు పైగా ఉన్నాయి. బేబీ తరువాత ఆనంద్ దేవరకొండ తో మరో సినిమాలో నటిస్తున్న ఆమె.. ఇది కాకుండా సిద్దు జొన్నలగడ్డ సరసన ఒక సినిమా, ఆశిష్ రెడ్డి సరసన ఒక సినిమాలో నటిస్తోంది. ఇక సినిమాలతో పాటు ఈ చిన్నది సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్ గా ఉంటుంది.

ఇక నిన్న సంక్రాంతి కావడంతో వైష్ణవి.. తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. ఆమె.. తల్లితో కలిసి ముగ్గు వేస్తూ కనిపించింది. నిండైన చీరకట్టు, తలనిండా మల్లెపూలు పెట్టుకొని ముగ్గుకు రంగులు దిద్దుతూ ఫోటోలకు పోజ్ ఇచ్చింది. ఇక ఈ ఫోటోలకు అద్భుతమైన క్యాప్షన్ కూడా ఇచ్చింది. తాను ఫొటోకు పోజులు ఇవ్వడానికి ముగ్గు దగ్గర కూర్చోలేదని, అమ్మతో కలిసి తానే ఆ ముగ్గును వేసినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు బేబీ పాప.. ముగ్గేస్తూ.. అబ్బాయిలను ముగ్గులోకి దింపుతుందే అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాలతో వైష్ణవి ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.