NTV Telugu Site icon

Vaishnavi Chaitanya: బిగ్ బాస్ లోకి ‘బేబీ’.. ఏం మాట్లాడుతున్నార్రా.. నరాలు కట్ అవుతున్నాయి

Vashu

Vashu

Vaishnavi Chaitanya: బేబీ సినిమాతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది వైష్ణవి చైతన్య. యూట్యూబర్ గా కెరీర్ ను ప్రారంభించిన ఆమె.. చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. బేబీ మూవీతో హీరోయిన్ గా తెలుగుతెరకు పరిచయామైంది. ఇద్దరు హీరోలను మోసం చేసే హీరోయిన్ గా ఆమె నటనకు ఫిదా కానీ వారుండరు అంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా తరుబాథ అమ్మడి రేంజ్.. ఓ రేంజ్ లో పెరిగిపోయింది. అందుతున్న సమాచారం ప్రకారం వైష్ణవి ప్రస్తుతం సినిమా కథలను వింటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి వైష్ణవి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 7 మొదలుకానుంది. ఇప్పటికే అక్కినేని నాగార్జున ప్రోమో కూడా రిలీజ్ అయ్యి.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం తెల్సిందే. ఇక మొదటి నుంచి ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ ను గట్టిగా ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సీరియల్ జంట అమర్ డీప్, తేజస్విని .. బ్యాంకాక్ పిల్ల, ప్రభాకర్ కొడుకు చంద్రహాస్, కార్తీక దీపం నటి శోభా.. ఇలా చాలా పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు వైష్ణవి పేరు కూడా గట్టిగా వినిపిస్తుంది.

Baby Movie: బేబీ మూవీ వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా.. చేసి ఉంటేనా.. ?

ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ తెచ్చుకున్న వైష్ణవి.. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే.. రేటింగ్ బాగా పెరుగుతుందని మేకర్స్ అధిక రెమ్యూనిరేషన్ ఇచ్చి మరీ తీసుకు వచ్చే ప్లాన్ లో ఉన్నారని టాక్ నడుస్తోంది. అయితే వైష్ణవి మాత్రం నిసక్కోచంగా ఈ ఆఫర్ ను వదులుకుందంట. హీరోయిన్ గా ఇప్పుడే తన జర్నీ మొదలు అయ్యింది. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ కు వెళ్లి.. అవకాశాలను చేజార్చుకోవడం ఎందుకు అని ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వార్త వినగానే ఆమె అభిమానులు సైతం ఏం మాట్లాడుతున్నార్రా.. నరాలు కట్ అవుతున్నాయి అటు షాక్ అవుతున్నారు. మరి వైష్ణవి.. అధికారికంగా ఈ వార్తలపై స్పందిస్తుందేమో చూడాలి.