వడివేలు అనే పేరు వినగానే ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి సినీ అభిమానికి ఒక మంచి కమెడియన్ గుర్తొస్తాడు. బ్రహ్మానందం స్థాయి కలిగిన నటుల్లో ఒకడైన వడివేలు ఒకప్పుడు పోస్టర్ పై కనిపిస్తే చాలు, ఆయన కోసమే సినిమాకి వెళ్లే వాళ్లు ఎంతోమంది. స్టార్ కమెడియన్ గా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే రాజకీయాల బురద పూసుకొని సినిమాలకి దూరం అయ్యాడు వడివేలు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది సంవత్సరాల పాటు వడివేలు లైమ్ లైట్ కి దూరంగా బ్రతికాడు. ఇక వడివేలుని తెరపై చూడలేమేమో అని ఫాన్స్ కూడా డిసైడ్ అయిపోయారు, ఇలాంటి సమయంలో వడివేలు కంబ్యాక్ కి రంగం సిద్ధమయ్యింది. దశాబ్దం తర్వాత సినిమాల్లోకి తిరిగొస్తూ వడివేలు ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘మామన్నన్’. ఈ సినిమాలో వడివేలు ఇప్పటివరకు చూడని రోల్ లో కనిపించనున్నాడు.
ఉదయ నిధి స్టాలిన్ హీరోగా, ఫాహద్ ఫజిల్ విలన్ గా, కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న మామన్నన్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ లో వడివేలుని చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే, అంతలా చేంజ్ ఓవర్ చూపించాడు. కమెడియన్ నుంచి రూట్ మార్చిన వడివేలు, మామన్నన్ సినిమాలో సీరియస్ రోల్ చేస్తూ తనలోని ఒకప్పటి వెర్సటైల్ నటుడిని ఆడియన్స్ కి మళ్లీ గుర్తు చేస్తున్నాడు. ధనుష్ తో కర్ణన్ లాంటి సినిమా చేసి హిట్ కొట్టిన ‘మారీ సెల్వరాజ్’, వాడివేలుని కొత్తగా చూపించడంలో సక్సస్ అయ్యాడు. ఫాహద్ కూడా సూపర్బ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఇంప్రెస్ చేసాడు. రెహ్మాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కి బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలిచింది. జూన్ 29న రిలీజ్ కి షెడ్యూల్ అయిన మామన్నన్ సినిమా వడివేలుకి సాలిడ్ కంబ్యాక్ ఇస్తుదేమో చూడాలి.
